- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడ్డగోలు హామీలిచ్చి తప్పుకుంటే ఎన్నికల్లో మూల్యం తప్పదు : కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
బీజేపీ వచ్చే ఎన్నికల కోసం కాకుండా, రాబోయే తరం భవిష్యత్తు కోసం ఆలోచిస్తుందని, తాము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నామని పేర్కొంటూ, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించామన్నారు.

- రాజకీయ నాయకులకు విశ్వసనీయతే పెట్టుబడి
- బీజేపీ ప్రజలకు ఇచ్చిన నిలబెట్టకుని హామీలు అమలు చేస్తోంది
- దేశంలో ఏ రోగానికి మందు కావాలో మన వద్ద వ్యాక్సిన్ఉంది
- శత్రువులను చిత్తు చేసే బ్రహ్మోస్మిసైల్ కూడా సిద్దంగా ఉంది
- కాంగ్రెస్‌పాలనలో చేసిన స్కామ్‌లతో దేశం ప్రతిష్ట మసక బారింది
- మోడీ 12 ఏళ్ల పాలనలో దేశం పేరు అంతర్జాతీయ స్ధాయిలో మారుమోగుతుంది
- బీజేపీ భవిష్యత్తు తరాల బాగోగుల కోసమే ఆలోచిస్తుంది
- UPA పాలనలో దేశానికి విదేశీ పెట్టుబడులు రాలేదు
- మోడీ అధికార చేపట్టిన తరువాత 38 దేశాల్లో పెట్టుబడి ఒప్పందాలు
దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో ఏ రోగానికి ఏ మందు కావాలో తమ దగ్గర కావాల్సిన వ్యాక్సిన్‌తో పాటు , శత్రువులను చిత్తు చేసే బ్రహ్మోస్కూడా తమ వద్ద సిద్దంగా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్హెచ్చరించారు. భారత రాజకీయాల్లో ప్రజల ఆశీస్సులు, అబిమానం ఎవరికైనా లభించిందంటే అది బీజేపీకీ మాత్రమే అన్నారు. ప్రధాని మోడీ అదికార చేపట్టిన 12 ఏళ్లలో అంతర్జాతీయ సమాజంలో భారత దేశ ప్రతిష్ట పెరిగిందని తెలిపారు. భారత్మాట ఎవరు వినను అనే స్ధాయి నుంచి అంతర్జాతీయ వేదికలపై భారతదేశం ఏది చెప్పినా యావత్ప్రపంచం శ్రద్దగా వింటుందన్నారు. తెలంగాణలో రహదారులు రెండింతలు పెరిగాయని, రూ.5500 కోట్ల రైల్వే బడ్జెట్మంజూరు చేసినట్లు చెప్పారు. పీఎం మిత్రా పార్క్‌ను గత నెలలో మోడీ ప్రారంబించారని గుర్తు చేశారు. దేశంలో ఆయన నేతృత్వంలో నక్సలిజం లేకుండా చేశామని, ఆర్థికల్370 రద్దు చేసినట్లు వెల్లడించారు. కాశ్మీర్లాల్చౌక్ లో తిరంగా జెండా ఎగురుతుందని, పరిశ్రమలు వస్తున్నాయని పేర్కొన్నారు. కృష్టాష్టమి వేడుకలు కూడా జరుగుతున్నాయన్నారు. ఒకప్పడు దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే విదేశాలు భయపడేవని, ఇప్పడు ఎన్నో దేశాలు మన దేశంలో వ్యాపార ఒప్పందాలు చేసుకుంటాయని వెల్లడించారు. మోడీ పాలనలో భారతదేశం అంతర్జాతీయ వేదికలపై తిరుగులేని గౌరవాన్ని, శక్తివంతమైన గుర్తింపును సాధించిందని కొనియాడారు. శుక్రవారం సికింద్రాబాద్‌లో నిర్వహించిన మేధావుల సమ్మేళనంలో 12 ఏళ్ల సుపరిపాలన - అభివృద్ధి - ప్రజా సంక్షేమం అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో ప్రసంగించారు. 2047 నాటికి భారతదేశం ఖచ్చితంగా వికసిత భారత్'గా మారి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నాయకుడికి కానీ పార్టీకి అతిపెద్ద పెట్టుబడి విశ్వసనీయత అని, చెప్పేదానికి చేసేదానికి తేడా ఉన్నప్పుడు విశ్వసనీయత సంక్షోభం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఈ సంక్షోభం ఉండేదని, కానీ బీజేపీ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వారికి అక్కడి ప్రజలు బుద్ధి చెప్పారని, అక్కడ బీజేపీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విజయవంతమైందన్నారు. ఒక నమ్మకమైన నాయకుడికి ఉండాల్సిన నాలుగు గుణాలు పారదర్శకత , నిజాయితీ, పని చేసే సామర్థ్యం, ఇచ్చిన హామీలను ఫలితాలుగా మార్చే నైపుణ్యం ఉండాలన్నారు. మోడీ ప్రధాని కాగానే నా ఖాంగీ, నా కిసీకో ఖానే దూంగా అని స్పష్టం చేశారని, మంత్రి అయినా, సామాన్యుడైనా అవినీతిని సహించేది లేదని నిరూపించారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 2జీ స్కామ్, కామన్వెల్త్ స్కామ్, ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ స్కామ్ వంటి లక్షల కోట్ల అవినీతి వల్ల దేశ ప్రతిష్ట మసకబారిందని, సైనికుల భద్రతను కూడా పణంగా పెట్టారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక రక్షణ బడ్జెట్‌ను రూ. 2.5 లక్షల కోట్ల నుండి దాదాపు రూ. 8 లక్షల కోట్లకు పెంచామని, రక్షణ రంగానికి కేటాయించే ప్రతి పైసా అత్యంత పారదర్శకంగా, దేశ భద్రత కోసమే ఖర్చవుతోందన్నారు.
ప్రజలకు ఇచ్చిన మాటను బీజేపీ నిలబెట్టుకుంటోంది
బీజేపీ వచ్చే ఎన్నికల కోసం కాకుండా, రాబోయే తరం భవిష్యత్తు కోసం ఆలోచిస్తుందని, తాము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నామని పేర్కొంటూ, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించామన్నారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా చొరబాటుదారులను బయటకు పంపే పని వేగవంతమైందని తెలిపారు. ముస్లిం మహిళల జీవితాల్లో శాపంగా మారిన తీన్ తలాక్ సామాజిక దురాచారాన్ని చట్టబద్ధంగా రద్దు చేశామని, వక్ఫ్ చట్టాల్లో అవసరమైన సంస్కరణలను విజయవంతంగా తీసుకువచ్చామని చెప్పారు. కొత్త పార్లమెంట్ భవనంలో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చారిత్రాత్మక బిల్లును తీసుకువచ్చామని, మహిళలకు పూర్తి భాగస్వామ్యం, హక్కులు దక్కే వరకు తాము విశ్రమించబోమని కుండ బద్దలు కొట్టారు. దేశంలో సమయం, వృధా ఖర్చులను తగ్గించడానికి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నదే మా ఆలోచన అని, అందరినీ విశ్వాసంలోకి తీసుకుని ఈ పనిని ఖచ్చితంగా చేసి తీరుతామని స్పష్టం చేశారు. కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అవసరమైన వ్యాక్సిన్లలో 60 శాతం మన దేశంలోనే తయారయ్యాయని, వ్యాక్సిన్ మైత్రి ద్వారా 100కు పైగా దేశాలకు 30 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్లను పంపిణీ చేశామని చెప్పారు. భారతదేశం దగ్గర ప్రపంచాన్ని రక్షించే వ్యాక్సిన్ ఎంత ఉందో, శత్రువులను తుత్తునియలు చేసే బ్రహ్మోస్' మిసైల్ కూడా అంతకంటే శక్తివంతంగా ఉందని హెచ్చరించారు. ప్రధాని మోడీ పనితీరును, దేశం పట్ల ఆయనకున్న ప్రేమను వివరిస్తూ, 2022లో ఆయన మాతృమూర్తి స్వర్గస్తులైనప్పుడు, ఆ బాధాకరమైన రోజున కూడా ఆయన తన తల్లి అంత్యక్రియలు ముగించుకున్న వెంటనే దేశ సేవలో నిమగ్నమయ్యారని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ 'వన్ నేషన్, వన్ మార్కెట్, వన్ టాక్స్' విధానంతో జీఎస్టీని విజయవంతంగా అమలు చేశామని, దీంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరిగిందని అన్నారు. శ్రామికుల సామాజిక భద్రత, ఆదాయం పెంచేందుకు నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చామని, అలాగే వలసరాజ్యాల కాలం నాటి పాత చట్టాల స్థానంలో దేశ పౌరుల హక్కులను వేగంగా కాపాడేలా కొత్త న్యాయ చట్టాలను తీసుకువచ్చామని తెలిపారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు చెల్లవు అన్న పండిత్ శ్యామాప్రసాద్ ముఖర్జీ కలని నిజం చేశామని చెప్పారు.
కాంగ్రెస్‌పాలనలో విదేశీ పెట్టుబడులు రాలేదు
2014కు ముందు దేశంలో నిరాశ నిండి ఉండేదని, విదేశీ పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని, నేడు ప్రపంచ దేశాలన్నీ భారత్‌తో వాణిజ్య సంబంధాల కోసం పోటీ పడుతున్నాయని తెలిపారు. 38 దేశాలు భారత్‌తో కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో కంపెనీలు చైనాకు వెళ్లిపోయాయని, దేశం పెద్ద ఎత్తున ఉపాధిని కోల్పోయిందని విమర్శించారు. మోడీ రాగానే దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని ప్రోత్సహించి, గత ఏడాది దేశంలోనే మొట్టమొదటి 'మేడ్ ఇన్ ఇండియా' సెమీకండక్టర్ చిప్‌ను తయారు చేసి చూపామని ప్రకటించారు. గతంలో కేవలం రూ.1000 కోట్లుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు నేడు దాదాపు రూ. 39 వేల చేరాయని, ప్రపంచంలోని 100కు పైగా దేశాలకు భారతదేశం రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోందన్నారు. రాబోయే 5 నుండి 8 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని నొక్కి చెప్పారు. రాజులమని భావించే కాంగ్రెస్ నాయకులకు పేదరికం, గ్రామీణ బాధలు ఎప్పటికీ అర్థం కావని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైల్వే బడ్జెట్ కోసమే దాదాపు రూ. 5 వేల నుండి రూ. 5,500 కోట్లు కేటాయించామని చెప్పారు. ప్రస్తుతం రూ. 32 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయని, 5 వందే భారత్ రైళ్లు, 6 అమృత్ భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. మల్కాజ్‌గిరిలో ఇండియన్ ఆయిల్ కొత్త టెర్మినల్ ప్రారంభం ద్వారా తెలంగాణ ఇంధన అవసరాలు తీరనున్నాయని చెప్పారు. దేశాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు, వికసిత భారత్ నిర్మాణంలో మోడీ నాయకత్వానికి, బీజేపీకి తెలంగాణ ప్రజల, మేధావుల సంపూర్ణ ఆశీస్సులు, మద్దతు ఉండాలని కోరారు.






