జొమాటో ఉద్యోగుల మధ్య ఘర్షణ.. ఇద్దరికీ గాయాలు

by Kodari Anjali |

జొమాటో ఉద్యోగస్తుల మధ్య ఘర్షణ కారణంగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

జొమాటో ఉద్యోగుల మధ్య ఘర్షణ.. ఇద్దరికీ గాయాలు
X

దిశ, కార్వాన్: జొమాటో ఉద్యోగస్తుల మధ్య ఘర్షణ కారణంగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రామయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గత రెండు నెలల జీతాలు తక్కువ వచ్చిందని, దీనికి కారణం ఉదయ్ అని సహ ఉద్యోగి అల్తాఫ్ మధ్య గురువారం అర్ధరాత్రి జొమాటో స్టోర్ వద్ద ఘర్షణ ఏర్పడింది. అయితే అల్తాఫ్ వెళ్లి సుమారు 20 మందిని తీసుకువచ్చి సహ ఉద్యోగి ఉదయ్, లోకేష్‌పై ఘర్షణకు దిగారు. ఈ సంఘటనలో ఉదయ్ లోకేష్ తీవ్ర గాయాలై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దాడి చేసిన వారిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విషయం బయటికి వచ్చింది.

Next Story