- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారిపై అమానుషం.. నిందితుడిని వదిలే ప్రసక్తే లేదు : మంత్రి సీతక్క
ఖమ్మం జిల్లాలో అత్యాచారయత్నానికి గురై, తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి సీతక్క శుక్రవారం పరామర్శించారు.

ఖమ్మం బాధితురాలికి నిమ్స్‌లో పరామర్శ, మెరుగైన వైద్యానికి ఆదేశం
రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి సీతక్క
దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మం జిల్లాలో అత్యాచారయత్నానికి గురై, తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి సీతక్క శుక్రవారం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్, వైద్యులతో మంత్రి చర్చించారు. ప్రస్తుతం బాలికకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందుతోందని, ఆమె పూర్తిగా కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉంచి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే తన ఆధ్వర్యంలో రూ.70 వేల సహాయాన్ని కుటుంబానికి అందజేశారు.
నిందితుడికి కఠిన శిక్ష తప్పదు..
ఈ ఘటనపై ఖమ్మం పోలీస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. "తాత వయసులో ఉన్న వ్యక్తి ఇంతటి దుర్మార్గానికి పాల్పడటం బాధాకరం. ఎంతటి రాజకీయ అండ ఉన్నా, నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టప్రకారం అతనికి కఠిన శిక్ష పడేలా చూస్తాం" అని మంత్రి స్పష్టం చేశారు. మహిళలు, బాలికల భద్రత విషయంలో రాజీ పడేది లేదని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.






