- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: కార్మిక సంఘాలకు ముందు గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్టీసీ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకింది. ముందుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనమే చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న స్పష్టం చేశారు. శుక్రవారం నగరంలోని ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో జేఏసీ అత్యవసర సమావేశం జరిగింది. ఆర్టీసీ సమ్మె తర్వాత ఈ ఏడాది మే1న ఆర్టీసీ కార్మిక సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు తాము విలీనమే ముందు జరగాలని విజ్ఞప్తి చేసినట్లు జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి తెలిపారు. అన్ని కార్మిక సంఘాలు కూడా ముందు విలీనానికే మొగ్గు చూపుతున్నందున ప్రభుత్వం కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియను ఆపేసి విలీన ప్రక్రియను చేపట్టాలని కోరారు. జేఏసీ కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి యాదగిరి పాల్గొన్నారు.
ముందు విలీనమే..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియే ముందు జరగాలని ఆర్టీసీ సెకండ్ జేఏసీ నేతలు ప్రభుత్వాన్నికోరారు. సమ్మె ముగిసిన తర్వాత ప్రభుత్వంతో చర్చల సందర్భంగా తాము విలీనమే ముందు జరగాలని కోరినట్లు సంఘం నేత అశ్వద్ధామరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. యాజమాన్యం కార్మికుల మనోభావాలకు గుర్తించి తక్షణమే విలీనం చేయాలని, విలీన అంశమే తమ మొదటి ప్రాధాన్యత అని ఎన్ఎంయూ నేత మర్రి నరేందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.






