- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాలి దుమారానికి చెట్టు ఎక్కిన రేకులు..
by Kodari Anjali |
గరిడేపల్లి మండల కేంద్రంలో ఓ ఇంటి రేకులు గాలి దుమారానికి చెట్టెక్కాయి.

X
దిశ, గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం వీచిన గాలి దుమారం వర్షానికి మండల కేంద్రంలోని కల్మలచేరువు రోడ్డులో గల ఎస్సీ కాలనీకి చెందిన బొజ్జ ఉప్పలయ్య ఇంటి రేకులు ఎగిరిపోయి వేప చెట్టుపై వాలాయి. అనంతరం కురిసిన వర్షం, గాలి దుమారానికి జనం బయటికి రావడం రాకపోవడంతో ప్రమాదం తప్పింది. రాత్రి మొత్తం ఆ రేకులు ఎక్కడ కిందపడి ఎవరి మీద పడతాయో అని కంటికి కునుకు లేకుండా తెల్లవార్లు కాపలా కాయాల్సి వచ్చిందని తెలిపాడు. రేకుల కప్పు కురవడంతో అందులో ఉండే ఉప్పలయ్య తన కుమారుడుతో కలిసి వేరే ఇంటికి వెళ్లడంతో ప్రాణాప్రాయం తప్పిందన్నాడు. మర్నాడు శుక్రవారం ఉదయం గ్రామస్తుల సాయంతో ఆ రేకులను చెట్టుపై నుండి కిందికి దించినట్టు తెలిపారు. గాలి దుమారంతో నీడను కోల్పోయిన తనకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Next Story






