- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
14న విజయ్ దేవరకొండ స్వగ్రామం తుమ్మన్ పేటకు రాక
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్ పేట తన స్వగ్రామానికి ప్రముఖ సినీ వెండితెర నటులు విజయ్ దేవరకొండ- రష్మిక దంపతులు ఈ నెల 14న రానున్నారని ఆయన మేనేజర్ కన్నారావు శుక్రవారం మీడియాకు తెలిపారు.

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్ పేట తన స్వగ్రామానికి ప్రముఖ సినీ వెండితెర నటులు విజయ్ దేవరకొండ-రష్మిక దంపతులు ఈ నెల 14న రానున్నారని ఆయన మేనేజర్ కన్నారావు శుక్రవారం మీడియాకు తెలిపారు. విజయ్ దేవరకొండ రష్మి కల వివాహం అనంతరం ఈ ఏడాది మార్చి 2న సొంత గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన నూతన గృహంలో గృహ ప్రవేశంతో పాటు సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అందరిని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా తన సొంత ప్రాంతమైన అచ్చంపేట ప్రజలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ ప్రాంతంలోని 45 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9, 10 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు దేవరకొండ ఫౌండేషన్ ద్వారా స్కాలర్ షిప్ అందజేస్తానని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం..
విద్య ప్రాధాన్యతను గుర్తించిన నటుడు విజయ్ దేవరకొండ ఆరోజు ఇచ్చిన మాట ప్రకారం.. అచ్చంపేట నియోజకవర్గంలోని 45 ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న 180 మంది విద్యార్థులకు తన ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఉండేలా ఉపకార వేతనాన్ని అందజేస్తానని చెప్పిన విధంగానే తన అనుచర గణంతో విద్యార్థుల సమాచారాన్ని సేకరించి పారితోషికం ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులతో పాటు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా విద్యాధికారీ అలాగే ఎంపిక చేసిన విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరవుతున్నారని ఆయన మేనేజర్ తెలిపారు.






