- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఐతో సంభాషణ.. ‘ప్లీజ్’ & ‘థాంక్యూ’ అనాలా ?
ఏఐ మోడల్స్ సంభాషణలో మర్యాదకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వవు. ‘ప్లీజ్’ అన్నంత మాత్రాన బెటర్ సమాధానాలు రావ్వవు!

దిశ, ఫీచర్స్ : చాట్‌జీపీటీ, క్లాడ్, జెమిని వంటి ఏఐ చాట్‌బాట్‌లతో మాట్లాడేటప్పుడు చాలా మంది యూజర్లు “ప్లీజ్”, “థాంక్ యూ”, “ఇఫ్ యూ డోంట్ మైండ్” అని మర్యాదగా మాట్లాడుతుంటారు. ఇది మానవ సహజ స్వభావం కావడంతో సాధారణంగా అనిపిస్తుంది. కానీ టెక్ నిపుణులు దీనిని వృథా ప్రయాస అంటున్నారు. ఎందుకంటే.. ఏఐ (AI) మోడల్స్ మర్యాదకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వవు. “ప్లీజ్” అని చెప్పినంత మాత్రాన బెటర్ సమాధానాలు రావని, AIలు పోలైట్ లేదా రూడ్ యూజర్లను గుర్తుంచుకోవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కోపం - భావోద్వేగాల ప్రభావం
అయితే అత్యధిక కోపం లేదా ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడితే AI సమాధానాల నాణ్యత తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోపంగా మాట్లాడితే AI మరింత విసుగు చెంది(sycophantic), తప్పుడు లేదా అసంబద్ధమైన సమాధానాలు ఇవ్వడం పెరుగుతుంది. అంటే ఇక్కడ అధిక మర్యాద, అధిక కోపం, ఈ రెండూ AI పని తీరును కొంతవరకు ప్రభావితం చేస్తాయి. కాబట్టి బెస్ట్ రిజల్ట్స్ కోసం క్లారిటీగా, సింపుల్‌గా, భావోద్వేగాలు లేని (neutral) ప్రాంప్ట్స్ ఇవ్వడం ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ఏఐ మోడల్స్ స్పృహ గల జీవులు కాదు, కేవలం డేటా ఆధారంగా పని చేసే టూల్స్ మాత్రమే. మనం వాటితో ఎలా మాట్లాడినా వాటికి భావోద్వేగాలు ఉండవు. కాబట్టి సమయం వృథా కాకుండా స్పష్టంగా మాట్లాడటం లేదా ప్రాంప్ట్ ఇవ్వడంబెటర్.






