మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి దంప‌తులు

by Nallavelli.Anjaneyulu |

మ‌ల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మర్రి మమత రెడ్డితో కలిసి ఎర్రవల్లిలో శుక్రవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శోభమ్మని మర్యాదపూర్వకంగా కలిశారు.

మాజీ సీఎం కేసీఆర్ ను  ఆహ్వానించిన  ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి దంప‌తులు
X

దిశ‌, అల్వాల్ : మ‌ల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మర్రి మమత రెడ్డితో కలిసి ఎర్రవల్లిలో శుక్రవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శోభమ్మని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తల్లిదండ్రులు, మర్రి లక్ష్మణ్ రెడ్డి, అరుంధతి రెడ్డి 60వ వివాహ వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావలసిందిగా కేసీఆర్ ను శోభమ్మ ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్, శోభమ్మకు మర్రి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మర్రి లక్ష్మణ్ రెడ్డి, అరుంధతి రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు.

Next Story