ఏం తమాషాలు చేస్తున్నారా : మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఫైర్

by Taduka Kalyani |

ఏం తమాషాలు చేస్తున్నారా ఇంటికి వెళ్తున్న ప్రతిసారి అడ్డగించి పోలీస్ స్టేషన్ లో ఉంచేందుకు మేము ఏమైనా దొంగల మా అంటూ చంగముల్, పరిగి ఎస్సై భరత్, మోహన్ కృష్ణ ల పై పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏం తమాషాలు చేస్తున్నారా : మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఫైర్
X

దిశ,పరిగి : ఏం తమాషాలు చేస్తున్నారా ఇంటికి వెళ్తున్న ప్రతిసారి అడ్డగించి పోలీస్ స్టేషన్ లో ఉంచేందుకు మేము ఏమైనా దొంగల మా అంటూ చంగముల్, పరిగి ఎస్సై భరత్, మోహన్ కృష్ణ ల పై పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి పరిగి కి వస్తున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని హైవే 163 పై మన్నెగూడ( చంగముల్ పోలీస్ స్టేషన్ వద్ద) అడ్డగించి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ప్రతిసారి ఇలా ఎందుకు అడ్డుకుంటూ, అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇందుకు సమాధానం ఇస్తున్న ఎస్సైలు పరిగి మండలం కాలాపూర్ లో పరిస్థితి తీవ్రంగా ఉందని మీరు అక్కడికి వెళ్తే మరింత ఉధృతంగా మారుతోందని ఎస్సైలు సూచించారు. నేను పరిగి లోని నా ఇంటికి వెళ్తున్నానని ఇలా ప్రతిసారి అడ్డగిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. అయినా వినకుండా పోలీసులు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఏం తమాషాలు చేస్తున్నారా ప్రతిసారి ఇలా అడ్డగిస్తూ అదుపులోకి తీసుకునేందుకు మేము దొంగలమా అంటూ ఫైర్ అవ్వడంతో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అనంతరం పోలీసులు ఇంటికి వెళ్తున్నారు కదా అంటూ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని విడిచిపెట్టారు. కాలాపూర్ లో ఇండస్ట్రియల్ పార్కు వద్దంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్న రైతులకు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మద్దతు ఇవ్వకుండా పరిగిలోని ఆయన నివాసం వద్ద పోలీసులు పహారా నిర్వహిస్తున్నారు.

Next Story