- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు మోడీ సొంతం : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు మోడీ సొంతం : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
నరేంద్ర మోడీ ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

X
దిశ, కామారెడ్డి రూరల్ : నరేంద్ర మోడీ ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు మోదీ సొంతం అని, దేశంలో అత్యధిక ప్రజాదరణ ఉన్న ప్రధాని నరేంద్ర మోడీనే అని అన్నారు. భారత్ ను విశ్వ గురువుగా నిలబట్టడమే ఆయన సంకల్పం అని అందుకు ఆయన అహర్నిశలు పాటు పడుతున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది అని పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ లో కూడా అధికారంలోకి వస్తుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, పలువురు కౌన్సిలర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Next Story






