- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలిక పై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్షతో పాటు రూ. 20,000 జరిమానా విధిస్తూ గద్వాల పోక్సో కోర్టు తీర్పు వెల్లడించింది.

దిశ, గద్వాల క్రైమ్ : మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్షతో పాటు రూ. 20,000 జరిమానా విధిస్తూ గద్వాల పోక్సో కోర్టు తీర్పు వెల్లడించింది. అలంపూర్ మండలానికి చెందిన నిందితుడు పింజరి పెద్ద హుస్సేన్ అలియాస్ నడిపి హుస్సేన్ 2021లో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు అప్పటి అలంపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాడు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు జడ్జ్ వి. శ్రీనివాస్ నిందితుడికి జైలు శిక్ష ఖరారు చేశారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన డీఎస్పీ మొగిలయ్య, సీఐ వి. ప్రదీప్ కుమార్, ఎస్సై ఎం. రామకృష్ణ, ఏపీపీ కె. విజయ్ కుమార్, భరోసా కేంద్రం బృందం, కోర్టు డ్యూటీ అధికారులను ఎస్పీ టి. శ్రీనివాసరావు అభినందించారు.






