- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. పచ్చునూర్‌లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి సీజ్
అధికార బలం ఉంది కదా అని ప్రభుత్వ భూమిని నమిలేయాలని చూసిన ఓ మాజీ ఫీల్డ్ అసిస్టెంట్‌కు రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు.

దిశ, మానకొండూరు : అధికార బలం ఉంది కదా అని ప్రభుత్వ భూమిని నమిలేయాలని చూసిన ఓ మాజీ ఫీల్డ్ అసిస్టెంట్‌కు రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూర్ గ్రామంలో అక్రమ కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ‘దిశ’ కథనంతో కదిలిన యంత్రాంగం పచ్చునూర్ గ్రామంలోని సర్వే నెం. 737లో ఉన్న ‘దూసోళ్ల కుంట’, యాదవ నగర్ పాత శ్మశాన వాటికకు సంబంధించిన ప్రభుత్వ భూమిని ఒక మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ తన అధికార బలంతో అక్రమంగా కబ్జా చేశారంటూ గత మే 11న (11-05-2026) గ్రామ ప్రజలు కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో గ్రామస్తులు కలెక్టర్‌కు స్వయంగా ఫిర్యాదు చేశారు. ఈ భూదందాపై ప్రముఖ దినపత్రిక ‘దిశ’లో వచ్చిన కథనం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై తక్షణమే స్పందించిన కలెక్టర్ ఆదేశాల మేరకు మానకొండూరు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. వివాదాస్పద స్థలాన్ని పరిశీలించి, సదరు భూమిలో ఎలాంటి సాగు పనులు గానీ, ఆక్రమణలు గానీ చేయరాదని స్పష్టం చేస్తూ, అది "ప్రభుత్వ భూమి" అని తెలిపే హెచ్చరిక బోర్డును అక్కడ పాతారు. అధికార మదంతో ప్రభుత్వ భూములను కాజేయాలనుకునే అక్రమార్కులకు ఈ చర్య ఒక బలమైన గుణపాఠమని స్థానికులు కొనియాడుతు న్నారు.
న్యాయ పోరాటానికి తొలి విజయం
గ్రామ ప్రజల ఐక్యత, సత్యం, న్యాయం కోసం చేసిన పోరాటానికి ఇది తొలి విజయమని పచ్చునూర్ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఈ ఘటన మరోసారి నిరూపించింది.యాదవ నగర్ ప్రజల భవిష్యత్తు కోసం. "యాదవ నగర్ ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఈ ప్రభుత్వ భూమిని శ్మశాన వాటికగా పరిరక్షించి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. దీనివల్ల భవిష్యత్తులో శ్మశాన వాటిక స్థలం విషయంలో పేదలకు ఎలాంటి ఇబ్బందులు, వివాదాలు ఉండవు. ఊరికి దూరంగా వెళ్లాల్సిన ఇబ్బంది తప్పి, గ్రామంలో సామరస్యం నెలకొంటుంది" అని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ స్థలాన్ని శాశ్వతంగా శ్మశాన వాటిక కొరకే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






