భవనం పైనుంచి ఆరు నెలల చిన్నారితో దూకిన తల్లి

by Kodari Anjali |

మియాపూర్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది.

భవనం పైనుంచి ఆరు నెలల చిన్నారితో దూకిన తల్లి
X

దిశ, శేరిలింగంపల్లి: మియాపూర్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆరో అంతస్తు నుంచి బిడ్డతో సహా తల్లి కింద పడ్డారు. భవనం పైనుంచి దూకిన ఈషా సాహూ (37) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరు నెలల చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. మియాపూర్ ఇన్స్‌పెక్టర్ శివప్రసాద్ కథనం ప్రకారం.. మయూరి నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న విషాద ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. చిన్నారి ఫెన్సింగ్‌పై పడటంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించిన స్థానికులు, త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

చికిత్స పొందుతున్న శిశువు

రెండో కాన్పు తర్వాత తీవ్ర మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌కు గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. మృతురాలు, ఆమె భర్త ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story