‘సింగ’గా గోపీచంద్..

by Chukka Sudharani |

హీరో గోపీచంద్ త్వరలో ఓ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

‘సింగ’గా గోపీచంద్..
X

దిశ, సినిమా: హీరో గోపీచంద్ త్వరలో ఓ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీతో ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం కాబోతుండగా.. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా గోపీచంద్ పుట్టినరోజు కావడంతో.. ఆ సందర్భంగా సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు మేకర్స్.

పక్షుల కిలకిలారావాలతో ప్రారంభమయ్యే ఈ టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను దట్టమైన అడవి మధ్యలోకి తీసుకెళ్తుంది. చీకటిలో మెరుస్తున్న రెండు కళ్లను చూపిస్తూ.. వెంటనే గోపీచంద్‌ను రివీల్ చేస్తూ మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కళ్లలో ఆగ్రహం, చేతిలో గొడ్డలి, ప్రతీకారంతో రగిలిపోతున్న పాంథర్‌లా కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అలాగే దీనికి ‘సింగ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ గ్లింప్స్ గోపీచంద్ ట్రాన్స్‌ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిపిన పవర్ ఫుల్ కథతో ఈ చిత్రం తెరకెక్కబోతుండగా.. ఇందులో మలయాళ నటి అనార్కలి నజర్ (మొదటి పరిచయం) హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Next Story