- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో ఇటీవల శంకుస్థాపన చేసిన 75 కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, పటాన్ చెరు టౌన్ : పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో ఇటీవల శంకుస్థాపన చేసిన 75 కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కమీషనర్లు, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెలలో ప్రతి మున్సిపాలిటీలో చేపట్టిన 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఇస్నాపూర్, ఇంద్రేశం, గుమ్మడిదల పరిధిలో 50 శాతం పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన పనులు అతి త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. జిన్నారం మున్సిపల్ పరిధిలో టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రాకపోవడం లేదని, పనులు ప్రారంభం కావడంలేదని చైర్మన్ జనార్ధన్, కమిషనర్ నాగేందర్ లు తెలిపారు.
నిర్దేశించిన గడువు లోగా పనులు పూర్తి కావాల్సిందే..
టెండర్లు పొంది పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లు అందరినీ బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో పాటు, తిరిగి టెండర్లు రీ కాల్ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. గడ్డపోతారం పరిధిలో మొత్తం 15 పనులకు శంకుస్థాపన చేయగా వచ్చే వారంలో అన్ని పనులు ప్రారంభమవుతాయని కమిషనర్ తాన్య తెలిపారు. అభివృద్ధి పనుల అంశంలో నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని.. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పరిశీలించాలని ఆదేశించారు. ఇస్నాపూర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెడతామని తెలిపారు. అతి త్వరలో మున్సిపల్ పరిధిలో 10 ఎకరాలు కేటాయించి.. బయో మైనింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి మున్సిపల్ పరిధిలో పది కోట్ల రూపాయలతో ఫంక్షన్ హాల్ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సంయుక్తంగా నిధులు అందించనున్నాయని.. ఇందుకు సంబంధించి ఆయా మున్సిపల్ పాలకవర్గాలు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మున్సిపల్ పాలకవర్గం సభ్యులు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటూ వారి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు సుమలత, ప్రమీల, సుష్మ, కుమార్ గౌడ్, జనార్దన్, వైస్ చైర్మన్లు సంధ్య గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మహేందర్ గౌడ్, కమిషనర్లు వెంకట కిషన్, అజయ్ రెడ్డి, తాన్య, దశరథ్, నరేందర్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.






