- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌదీ నుంచి తోర్తికి చేరిన మృతదేహం
సౌదీలో మృతి చెందిన వ్యక్తి మృతదేహం శుక్రవారం మండల పరిధిలోని తోర్తి గ్రామానికి చేరుకుంది.

దిశ, ఎర్గట్ల : మండల పరిధిలోని తోర్తి గ్రామానికి చెందిన రాజారపు సత్యనారాయణ బతుకుదెరువు కోసం ఐదేళ్ల కిందట సౌదికి వలస వెళ్లాడు. సౌదీలో డ్రైవర్ గా విధులు నిర్వహించేవాడు. సౌదీలో తన డ్యూటీ ముగించుకొని తన స్నేహితుడి రూమ్ కి వెళ్లి భోజనం చేసిన తరువాత తన రూమ్ కి తిరుగు ప్రయాణంలో హార్ట్ ఎటాక్ రావడంతో రోడ్డు పక్కనే తాను ప్రయాణిస్తున్న కారును ఆపుకొగా అందులోనే మృతి చెందాడు. దాదాపు మూడు- నాలుగు రోజుల తర్వాత కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి చూడగా.. కుళ్ళిన మృతదేహం కనిపించింది. మృతునికి ఇద్దరు కూతుర్లు, భార్య కలరు. కుటుంబ యజమాని ని కోల్పోవడంతో, కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. దేశం కానీ దేశంలో ఆయన మృతి చెందడం శుక్రవారం రోజు ఆయన మృతదేహం తోర్తి గ్రామానికి రావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతదేహాన్ని ఎయిర్పోర్ట్ నుండి తోర్తి గ్రామానికి చేర్చేందుకు అంబులెన్సు సౌకర్యం కొరకు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం ఇన్ చార్జి ముత్యాల సునీల్ రెడ్డి ని కుటుంబ సభ్యులు సంప్రదించగా.. ఉచిత అంబులెన్సు సౌకర్యం ను ఏర్పాటు చేయించారు. ఈ సౌకర్యం కల్పించిన సునీల్ రెడ్డికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.






