కళ్యాణదుర్గంలో రాజకీయ వేడి.. ఉత్కంఠ రేపిన ఇరుపార్టీల ర్యాలీలు

by Vemula.Srinu Prasad |

కళ్యాణదుర్గం శాంతంగా ఉన్న కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం రాజకీయ కాక ఒక్కసారిగా పెరిగింది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో, పట్టణ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి...

కళ్యాణదుర్గంలో రాజకీయ వేడి.. ఉత్కంఠ రేపిన ఇరుపార్టీల ర్యాలీలు
X

దిశ, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం శాంతంగా ఉన్న కళ్యాణదుర్గం పట్టణంలో గురువారం రాజకీయ కాక ఒక్కసారిగా పెరిగింది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో, పట్టణ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లన్నీ ఒక్కసారిగా నినాదాలతో హోరెత్తిపోయాయి.

అసలు ఏం జరిగింది?

వెన్నుపోటుకు రెండేళ్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టుగా , టిడిపి పార్టీ రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ చేశారు. అయితే వీరు ఒకరికొకరు వెదురు పడినప్పుడు స్థానిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో మొదలైన ఈ వివాదం, కాసేపటికే ఘర్షణకు దారితీసేలా మారింది. ఇరు వర్గాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకోవడంతో, పరిస్థితి అదుపు తప్పుతుందేమోనన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమైంది. కొద్దిసేపు నినాదాలతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది.

అప్రమత్తమైన పోలీసులు

ఉద్రిక్తత పెరగడాన్ని గమనించిన పోలీసులు, వెంటనే అప్రమత్తమయ్యారు. ఎస్సై మరియు ఇతర పోలీసు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనకారులను చెదరగొట్టారు. రెండు వర్గాలకు చెందిన వారిని అక్కడి నుంచి పంపించివేసి, శాంతి భద్రతలను పునరుద్ధరించారు. ​పోలీసుల సమయస్ఫూర్తితోనే పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి పట్టణంలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, పోలీసులు నిఘాను మరింత పెంచారు.

Next Story