వెంకటేశ్వర స్వామి వారికి లక్షన్నర విరాళం..

by Kodari Anjali |

సదానందమూర్తి దేవమని పుణ్య దంపతులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లక్షన్నర విరాళం అందజేశారు.

వెంకటేశ్వర స్వామి వారికి  లక్షన్నర విరాళం..
X

దిశ, రాజపేట: రాజపేట మండలం రఘునాధపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం హైదరాబాద్ వాసులు గుల్లపల్లి సదానందమూర్తి సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ స్వామి వారి పుష్కర బ్రహ్మోత్సవాలకు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక లక్ష యాభై వేల రూపాయల చెక్కును ఆలయంలో శ్రీ స్వామివారికి సమర్పణ చేసి అనంతరం ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాచకొండ స్వామికి అందజేశారు. ఈ సందర్భంగా సదానందమూర్తి దేవమని పుణ్య దంపతులను శ్రీ స్వామివారి శేష వస్త్రములతో సత్కరించి వేద ఆశీర్వచనం చేసి శ్రీ స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Next Story