- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్యం వికటించి మహిళా మృతి
వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సెల్ హాస్పిటల్ లో చోటు చేసుకుంది.

దిశ, అల్వాల్ : వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సెల్ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సిటిజన్ కాలనీకి చెందిన పద్మావతి (45) గురువారం చేతికి గాయమైందని హాస్పటల్ కు వచ్చింది. పరీక్షలు చేసిన వైద్యులు ఏదో గుర్తు తెలియని ఇంజక్షన్ ఇవ్వగా బీపీ డౌన్ అవ్వడంతో పాటు బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించారు వైద్యులు. మరో ఆసుపత్రికి పంపించాలని తెలపడంతో కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. వారు కూడా ఇక్కడ వైద్యం చేయలేమని చెప్పడంతో గాంధీ హాస్పిటల్ కు వెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని బంధువులు తెలిపారు. శుక్రవారం మృతదేహంతో ఆసుపత్రి వద్దకు వచ్చి ధర్నా నిర్వహించారు. హాస్పిటల్ యజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే మహిళ మృతి చెందినట్టు బంధువులు ఆరోపించారు. వైద్య ఖర్చులతో పాటు తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో సైతం ఇదే హాస్పటల్ లో ఇదే తరహా మూడు నాలుగు కేసులు నమోదైనట్లు ఆరోపించారు. వైద్యుడు దేవునితో సమానమని భావించి ఏలుకు గాయమై వైద్యం కోసం వస్తే.. ప్రాణమే పోయిందని బంధువులు కన్నీరు మున్నేరుగా విలపించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హాస్పిటల్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






