- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్జెంటీనా ఫిఫా అభిమానులకు ఫ్రీ టీవీలు
అమెరికాలో జరుగుతున్న ఫిఫా 2026 మ్యాచులు చూసేందుకు వీసాలు సిద్ధం అయిన అర్జెంటీనా అభిమానులకు బంపర్ ఆఫర్ తగిలింది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా, కెనడా, మెక్సికో దేశాల సంయుక్త ఆతిథ్యంలో మెగా ఫుట్‌బాల్ టోర్నీ ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ (FIFA World Cup 2026) మ్యాచ్‌లు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ముఖ్యంగా అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సి (Lionel Messi) కి ఇదే ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్ కానుండటంతో, ఆయన ఆటను ప్రత్యక్షంగా చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే, అమెరికా వెళ్లేందుకు వీసాలు రాక తీవ్ర నిరాశలో మునిగిపోయిన అర్జెంటీనా అభిమానుల కోసం అక్కడి ఒక స్థానిక కంపెనీ ఊహించని బంపర్ ఆఫర్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
వీసా రిజెక్షన్ లేఖ చూపిస్తే.. టీవీ ఫ్రీ!
అర్జెంటీనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ 'న్యూసాన్'(Newsan), వీసా ఇంటర్వ్యూలో రిజెక్షన్ ఎదుర్కొన్న ఫుట్‌బాల్ అభిమానుల బాధను పోగొట్టేందుకు ఒక వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. అమెరికా ఎంబసీ నుంచి తమ వీసా తిరస్కరణకు గురైనట్లు అధికారిక పత్రాలను చూపించిన మొదటి 100 మంది అభిమానులకు తమ బ్రాండ్‌కు చెందిన 'నొబ్లెక్స్' (Noblex) స్మార్ట్ టీవీలను పూర్తిగా ఉచితంగా పంపిణీ చేసింది.
వినూత్న మార్కెటింగ్ టెక్నీక్
తమ ప్రియతమ ఆటగాడు మెస్సి ఆఖరి వరల్డ్ కప్ మ్యాచ్‌లను స్టేడియానికి వెళ్లి చూడలేకపోతున్నామనే తీవ్ర ఆవేదనలో ఉన్న అభిమానులకు ఈ ఆఫర్ పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పాలి. స్టేడియంకు వెళ్లలేకపోయినా.. కనీసం తమ ఇంట్లో పెద్ద స్క్రీన్‌పై అయినా వరల్డ్ కప్ మ్యాచ్‌లను స్పష్టంగా చూసి ఆనందించేందుకు ఈ ఉచిత టీవీలు ఉపయోగపడతాయని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక విపత్కర పరిస్థితుల్లో కూడా అభిమానుల సెంటిమెంట్‌ను క్యాచ్ చేస్తూ సదరు కంపెనీ చేసిన ఈ మార్కెటింగ్ స్టంట్ ప్రస్తుతం అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.






