- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. సీఎం రేవంత్ విమానం మళ్లింపు
హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి 9.30 గంటల సమయంలో ఆకాశం మబ్బులు కమ్మి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి 9.30 గంటల సమయంలో ఆకాశం మబ్బులు కమ్మి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కొద్దినిమిషాలుగా కురుస్తోన్న వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రధాన కూడళ్లలో వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. ఆఫీసుల నుంచి వెళ్లే ఉద్యోగులు, అమీర్ పేట్, మైత్రివనం, కూకట్ పల్లి వంటి ఏరియాల్లో సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీకెండ్ కావడంతో ఊళ్లకు పయనమైన వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు వర్షం కారణంగా అనేకమంది మెట్రోను ఆశ్రయించడంతో మెట్రో స్టేషన్లలో రద్దీ ఏర్పడింది. నగరంలోని కూకట్ పల్లి, అమీర్ పేట్, ఎర్రగడ్డ, మైత్రివనం, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, బేగంపేట, ప్యారజైర్డ్, ప్యాట్నీ, జేబీఎస్, సికింద్రాబాద్ ఏరియాల్లో భారీ వర్షం కురుస్తోంది.
సీఎం రేవంత్ విమానం మళ్లింపు
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తోన్న విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా.. మార్గంమధ్యలో వాతావరణం అనుకూలించలేదు. దీంతో పైలట్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. శంషాబాద్ లో విమానం ల్యాండింగ్ కు ఏటీసీ అనుమతి ఇవ్వకపోవడంతో విమానాన్ని అటువైపు మళ్లించినట్లు అధికారులు తెలిపారు.






