స.హ. చట్టానికి అధికారుల తూట్లు..?!

by Taduka Kalyani |

సమాచార హక్కు చట్టం 2005 కింద కోరిన సమాచారాన్ని అందించడంలో సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల అధికారుల నిర్లక్ష్యం వెలుగుచూస్తోంది.

స.హ. చట్టానికి అధికారుల తూట్లు..?!
X

దిశ, ఝరాసంగం: సమాచార హక్కు చట్టం 2005 కింద కోరిన సమాచారాన్ని అందించడంలో సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల అధికారుల నిర్లక్ష్యం వెలుగుచూస్తోంది. చట్టంలోని సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, గడువు ముగిసినా స్పందన లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బర్దిపూర్‌, కుప్పానగర్‌, జీర్లపల్లి గ్రామాలకు చెందిన పలువురు వెంచర్ల అనుమతులు, ప్రభుత్వ భూముల వినియోగం, గ్రామపంచాయతీ ఎన్నికల డిపాజిట్ రీఫండ్‌లకు సంబంధించిన వివరాల కోసం దరఖాస్తులు సమర్పించినట్లు తెలిసింది. సంబంధిత అధికారులు సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో దరఖాస్తుదారులు సెక్షన్ 19(1) కింద మొదటి అప్పీల్‌ను ఆశ్రయించగా సెక్షన్ 7(6) ప్రకారం ఉచిత సమాచారాన్ని కోరుతున్నారు. సమాచారం ఇవ్వకుండా జాప్యం చేసిన అధికారులపై సెక్షన్ 20(1) ప్రకారం చర్యలు తీసుకుని, సమాచారాన్ని అందించాలని అప్పీళ్లలో కోరినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై జిల్లా అధికారికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లా అధికారి వెంటనే సంబంధిత పౌరులకు సమాచారాన్ని అందించాలని ఆదేశించినప్పటికీ కింది స్థాయి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.

Next Story