దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేయండి.. చిన్న జీయర్ స్వామి

by Batti.Sumithra |   (  Updated:2026-06-14 08:21:35  IST  )

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి పనులపై ఆదివారం హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లోని శ్రీ చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మొగిలి శ్రీనివాసరెడ్డి చిన్న జీయర్ స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు.

దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేయండి.. చిన్న జీయర్ స్వామి
X

దిశ, ఏన్కూర్ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి పనుల గురించి ఆదివారం హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లోని శ్రీ చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మొగిలి శ్రీనివాసరెడ్డి చిన్న జీయర్ స్వామివారితో మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న దేవాలయ అభివృద్ధి పనుల గురించి చిన్న జీయర్ స్వామివారికి వివరించారు. గతంలో నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి యాగ కార్యక్రమాల్లో చిన్న జీయర్ స్వామివారు పాల్గొన్న విషయం తెలిసిందే. శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామివారి ప్రతిష్ఠ కార్యక్రమాల గురించి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మొగిలి శ్రీనివాసరెడ్డి వివరించారు. ఆయన వెంట ఎర్నేని రామారావు, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు కంభంపాటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Next Story