రాజ‌కీయాల్లోకి రండి.. అమ్మాయిల‌కు బీజేపీ ఆహ్వానం

by Vemula.Srinu Prasad |

దేశ‌ రాజ‌కీయాల్లో మహిళ‌లు చ‌క్రం తిప్పుతున్న విష‌యం తెలిసిందే. ముఖ్య‌మంత్రుల నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలగా అంతెందుకు దేశ రాష్ట్ర‌తుల వ‌ర‌కూ మహిళ‌లు ఎదుగుతున్నారు. ఈ నేప‌థ్యంలో పెళ్లిగాని అమ్మాయిలు, యువ‌తులలను సైతం రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని బీజేపీ యోచిస్తోంది. ..

రాజ‌కీయాల్లోకి రండి.. అమ్మాయిల‌కు బీజేపీ ఆహ్వానం
X

దిశ‌, వెబ్ డెస్క్ః దేశ‌ రాజ‌కీయాల్లో మహిళ‌లు చ‌క్రం తిప్పుతున్న విష‌యం తెలిసిందే. ముఖ్య‌మంత్రుల నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలగా అంతెందుకు దేశ రాష్ట్ర‌తుల వ‌ర‌కూ మహిళ‌లు ఎదుగుతున్నారు. ఈ నేప‌థ్యంలో పెళ్లిగాని అమ్మాయిలు, యువ‌తులలను సైతం రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని బీజేపీ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీ అమ్మాయిల‌ను రాజ‌కీయ‌ల్లోకి ఆహ్వానిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రాష్ట్ర స్థాయి రాజ‌కీయాల్లో రావాల‌ని పిలుపునిచ్చారు.

విజ‌య‌వాడ‌లో జ‌రిగిన బీజేపీ ప‌ధాదికారుల స‌మావేశంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. 25 ఏళ్ల లోపు వ‌య‌సున్న అమ్మాయిలు రాజ‌కీయాల్లోకి రావాల‌న్నారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్ర‌జ‌ల‌కు యువ‌త సేవ‌ చేస్తే బీజేపీ త‌న వంతు స‌హ‌కారం అందిస్తుంద‌ని తెలిపారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై యువ‌త త‌మ గ‌ళం విప్పాల‌ని సూచించారు. దేశాన్ని అభివృద్ది వైపు న‌డించేందుకు యువ‌త నిర్దిష్ట ల‌క్ష్యంతో ముందుకెళ్లాల‌ని మాధ‌వ్ సూచించారు.

Next Story