- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలోనే అజిత్ కుమార్‌తో సినిమా.. అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
స్టార్ హీరో అజిత్ కుమార్‌తో సినిమాపై అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ సూర్యతో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయాల్సి ఉండే కానీ.. ‘రెట్రో’ చేశాను అంటున్నాడు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో వచ్చి అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కార్తీక్ ఈ సినిమాను చాలా తక్కువ వ్యవధిలో తీసినట్లు చెప్పుకొచ్చాడు. ‘గతంలో సూర్య గారితో నేను ఒక సినిమా చేయాల్సి ఉండేది. అది భారీ బడ్జెట్ ప్రాజెక్ట్, ఆ కథ సూర్యకి కూడా బాగా నచ్చింది. అయితే, కొన్ని కారణాల వల్ల అప్పట్లో ఆ సినిమాను రూపొందించలేకపోయాము. ఈ క్రమంలోనే తక్కువ వ్యవధిలో ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నందున, దానికి బదులుగా 'రెట్రో' చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాము. ఎప్పుడు నవ్వని ఒక వ్యక్తి, తన చుట్టూ ఉన్నవారి ముఖాల్లో ఎలా చిరునవ్వులు పూయిస్తాడు, ఆ తర్వాత ఎలాంటి సన్నివేశాలు చోటుచేసుకుంటాయి అనే అంశాలతో దీనిని తెరకెక్కించాము’ అని తెలిపాడు. ప్రజెంట్ కార్తీక్ సుబ్బరాజ్ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. అందుకే సినిమా సక్సెస్ అవ్వలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. అలాగే అదే ఇంటర్వ్యూలో స్టార్ హీరో అజిత్ కుమార్‌తో సినిమా చేయడంపై మాట్లాడుతూ.. ‘ఆయనతో సినిమా చేసే అవకాశం ఖచ్చితంగా ఉందని నేను భావిస్తున్నాను. నేను దాని కోసం ప్రయత్నించాను.. ఆయనకు కథ వినిపించడం గురించి చర్చలు కూడా జరిగాయి. అయితే అది ఇంకా కార్యరూపం దాల్చలేదు, కానీ త్వరలోనే అది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఆ సినిమా నాకు జీవితకాల అనుభూతిని మిగిల్చింది: కార్తీక్ సుబ్బరాజు






