- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమా నాకు జీవితకాల అనుభూతిని మిగిల్చింది: కార్తీక్ సుబ్బరాజు
మొదట తాను హీరో ధనుష్‌తో ఒక సినిమా చేయాల్సి ఉందని, వై నాట్ స్టూడియోస్ దాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చినా కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని చెప్పారు.

దిశ, సినిమా: కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు గత ఏడాది ‘రెట్రో’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. కానీ హిట్ అందుకోలేకపోయారు. ఆ తర్వాత చేసిన ‘నీళిర, 29 చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయినప్పటికీ వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన ఇళయరాజాతో ఓ ప్రాజెక్ట్, ఇండిపెండెంట్ మూవీస్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ తన కెరీర్‌లో జరిగిన చేధు అనుభావాలను గుర్తు చేసుకుని ఆసక్తికర కామెంట్స్ చేశారు. మొదట తాను హీరో ధనుష్‌తో ఒక సినిమా చేయాల్సి ఉందని, వై నాట్ స్టూడియోస్ దాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చినా కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని చెప్పారు. అదే సమయంలో తనకు సన్ పిక్చర్స్ బ్యానర్‌లో రజనీకాంత్ గారిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని.. దాంతో ధనుష్ చిత్ర నిర్మాతలే పెద్ద మనసుతో రజనీ గారి సినిమా ముందు పూర్తి చేయమని చెప్పారని కార్తీక్ గుర్తుచేసుకున్నారు. అలా వచ్చిన చిత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘పేట’.
ఆ సినిమా రోజులు తనకు జీవితకాల అనుభూతిని మిగిల్చాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ‘పేట’ తర్వాత తాను ధనుష్‌తో ఎన్నో సవాళ్లను దాటుకుని లండన్ బ్యాక్‌డ్రాప్‌లో ‘జగమే తందిరం’ సినిమా చేశానని కార్తీక్ తెలిపారు. అయితే ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కావడంపై ధనుష్ ఇప్పటికీ బాధపడుతుంటారని చెప్పారు. తాము కలిసినప్పుడల్లా ఈ చిత్రం థియేటర్లలో వచ్చి ఉంటే బాగుండేదని, ఓటీటీ రిలీజ్ వల్ల ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదని ధనుష్ అంటుంటారని కార్తీక్ వెల్లడించారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం తన దగ్గర మరో అద్భుతమైన లైన్ సిద్ధంగా ఉందని, కానీ ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులతో పాటు కమల్ హాసన్‌తో కలిసి చేసే మల్టీస్టారర్ సినిమా ‘తలైవార్-173’ కూడా ఉందని.. బహుశా వాటి తర్వాతే తమ కాంబో ఉండొచ్చని కార్తీక్ సుబ్బరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.






