- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈత కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి చేరిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చేపల వేటకు వెల్లి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందాడు.

దిశ, వనపర్తి రూరల్: వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చేపల వేటకు వెల్లి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పానుగంటి నరేష్ (25) వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. శనివారం సాయంత్రం తన సోదరుడితో కలిసి చేపల వేటకు గ్రామంలోని గుండ్ల చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన నరేష్, అదే సమయంలో వర్షం కురవడంతో చెరువులో అలల ఉధృతి పెరగడంతో నీటిలో మునిగిపోయాడు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అధికారులకు తెలియజేయగా, ఎస్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందం శనివారం సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే వర్షం నిరంతరం కురుస్తుండటంతో నరేష్ ఆచూకీ శనివారం రాత్రి వరకు లభించలేదు. ఆదివారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు ప్రారంభించిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం, ఉదయం సుమారు 7:30 గంటలకు నరేష్ మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికితీసింది. మృతుడు నరేష్‌కు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నారు. ఈ విషాద ఘటనతో చిమనగుంటపల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.






