- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 7 కోట్ల బడ్జెట్.. 2,263 కోట్ల కలెక్షన్లు.. వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సినిమా
కేవలం 7 కోట్లతో తీసిన హాలీవుడ్ చిత్రం ‘అబ్సెషన్’ భారీ హిట్ సాధించి వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ. 2,263 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంది.

దిశ, వెబ్ డెస్క్: వందల కోట్లు ఖర్చు చేసిన సరైన హిట్ సాధించలేని ఈ రోజుల్లో ఓ చిత్రం కేవలం రూ. 7 కోట్లతో తెరకెక్కి వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోతమోగిస్తుంది. రిలీజైన ప్రతీ భాషలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటూ.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ‘అబ్సెషన్’ (Obsession) అనే సినిమా రూ. 2,263 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అలాగే ప్రస్తుతం కూడా వివిధ భాషల్లోకి అనువాదం చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. ఇంతటి సంచలనంగా మారిన ఈ సినిమాకు యూట్యూబ్ క్రియేటర్ కర్రీ బార్కర్ దర్శకత్వం వహించారు.
కేవలం $750,000 (సుమారు ₹7 కోట్లు) అత్యల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ‘అబ్సెషన్’ చిత్రం ప్రొడక్షన్ కాస్ట్‌కు వందల రెట్లు లాభాలను తెచ్చిపెడుతూ 2026 లార్జెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం కొన్ని గదులు, పరిమిత నటీనటులతో అద్భుతమైన హారర్-రొమాన్స్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు $238 మిలియన్లకు పైగా (సుమారు ₹2,263 కోట్లు) వసూలు చేసి హాలీవుడ్‌ను సైతం షాక్‌కు గురిచేసింది. 1999 నాటి ‘ది బ్లేర్ విచ్ ప్రాజెక్ట్’, 2007 నాటి ‘పారానార్మల్ యాక్టివిటీ’ చిత్రాల తర్వాత ఇంతటి భారీ ప్రాఫిట్ మార్జిన్ చూసిన హారర్ సినిమా ఇదే కావడం విశేషం.
ఇండియాలో భారీగా పెరిగిన క్రేజ్ - OTT అప్‌డేట్
భారతదేశంలోనూ ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మౌత్ టాక్ (Word of Mouth) పాజిటివ్‌గా ఉండటంతో ఇక్కడి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటికే ₹70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఈ ఏడాది ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుండటంతో.. ముందుగా అనుకున్న డిజిటల్/ఓటీటీ (OTT) విడుదలను మేకర్స్ మరి కొన్ని వారాల పాటు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే, థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ప్రముఖ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో (BookMyShow) స్ట్రీమ్‌లో రెంటల్ (Rental) ప్రాతిపదికన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషల డబ్బింగ్‌తో ఈ చిత్రం హోమ్ స్క్రీన్స్‌పైకి అందుబాటులోకి రానుంది.






