- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగ్ అశ్విన్ పై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న విజయ్ దేవరకొండ
బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ నాగ్ అశ్విన్ కోరడంతో ‘సింగ్ గీతం’ సినిమాలో చిన్న పాత్రలో విజయ్ నటించినట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ మంచి స్నేహితులు అన్న విషయం మనందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండకు మొదట మంచి గుర్తింపును తెచ్చిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాని హీరోగా నటించగా, విజయ్ కీలకమైన పాత్రలో నటించాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో కూడా విజయ్ కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే ఆయన దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 AD’ చిత్రంలో కూడా విజయ్ ఒక ముఖ్య పాత్రలో నటించాడు.
ఇలా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన పలు చిత్రాల్లో విజయ్ కనిపించడం విశేషం. ఇక తాజాగా నాగ్ అశ్విన్ ముందుండి నిర్మించిన ‘సింగ్ గీతం’ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ ఓ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో ఆయన నటించడం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, ఆ పాత్రకు ఆయన అయితే బాగుంటుందని నాగ్ అశ్విన్ కోరడంతో, తన బిజీ షెడ్యూల్ మధ్యలోనూ సమయం కేటాయించి ఈ చిత్రంలో నటించినట్లు తెలుస్తోంది. దీంతో నాగ్ అశ్విన్‌పై తన అభిమానాన్ని విజయ్ దేవరకొండ మరోసారి చాటుకున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.






