స్కూల్ ప్రారంభానికి ఇక ఒక్కరోజే

by Batti.Sumithra |

సుమారు రెండు నెలలుగా వేసవి సెలవుల్లో ఆటపాటలతో అవధులు లేని ఆనందాన్ని ఆస్వాదించిన విద్యార్థులు, రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మళ్లీ బడిబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.

స్కూల్ ప్రారంభానికి ఇక ఒక్కరోజే
X

దిశ, ఉప్పునుంతల : సుమారు రెండు నెలలుగా వేసవి సెలవుల్లో ఆటపాటలతో అవధులు లేని ఆనందాన్ని ఆస్వాదించిన విద్యార్థులు, రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మళ్లీ బడిబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, భారీ వర్షాల కారణంగా ఉప్పునుంతల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీ సమీపంలోని కల్వర్టు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కొట్టుకొస్తున్న చేపలను పట్టడంలో చిన్నారులు నిమగ్నమై అంతులేని ఆనందాన్ని పొందుతున్నారు. ఈ ఆహ్లాదకరమైన దృశ్యం "దిశ" కెమెరాకు చిక్కింది.

Next Story