- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది’ ఐటమ్ సాంగ్ విమర్శలపై స్పందించిన అనంత శ్రీరామ్.. ట్రోలర్స్‌కు మైండ్ బ్లోయింగ్ కౌంటర్
పాటను ఎంజాయ్ చేయడం చేతకాక కేవలం విమర్శించడమే పనిగా పెట్టుకునే వాళ్లు ఉంటారే.. ‘వాళ్లే అసలైన ఐటమ్ గాళ్లు’ అంటూ స్టేజ్ పైనే గట్టి కౌంటర్ ఇచ్చారు.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా, నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ రాసిన ఐటమ్ సాంగ్ పై సోషల్ మీడియాలో దారుణమైన విమర్శలు వచ్చాయి. ఈ పాట ఓ వైపు థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంటే, మరోవైపు కొందరు మాత్రం ఇందులోని లిరిక్స్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై అనంత శ్రీరామ్ తనదైన శైలిలో స్పందించారు. ఐటమ్ సాంగ్ వివాదంపై యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన మైండ్ బ్లోయింగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ పాటను ఒక స్పెషల్ సాంగ్‌లా చూసి ఆస్వాదించిన వాళ్లకు, తాము ఒక మంచి స్పెషల్ రుచిని చూపించినట్లు అవుతుందని ఆయన అన్నారు.
అలా కాకుండా, పాటను ఎంజాయ్ చేయడం చేతకాక కేవలం విమర్శించడమే పనిగా పెట్టుకునే వాళ్లు ఉంటారే.. ‘వాళ్లే అసలైన ఐటమ్ గాళ్లు’ అంటూ స్టేజ్ పైనే గట్టి కౌంటర్ ఇచ్చారు. లోపల ఉన్న కుళ్ళును, భావోద్వేగాలను బయటకు కక్కడానికో లేదా ఒక ప్రత్యేకమైన ఎజెండా పెట్టుకుని తనపై బురద చల్లడానికో విమర్శలు చేస్తే.. వాటికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం అస్సలు లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా కామెంట్లలో తనను బూతులు తిట్టిన వారికి కూడా అనంత శ్రీరామ్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. తనను నిందించిన వారి కోసం ఆయన రాసిన ఓ పాటలోని లైన్లను వేదికపై పాడి వినిపించారు. "ఒక్కో తిట్టు ఒక్కొక్క బొట్టుగా ఏదిదేటట్లు నేనొట్టు పెట్టనా.. నా ఏ రోజునో నీ రాజనం పట్టేదా నిందా నా కట్టె కాలేలోగా" అనే లైన్స్ ద్వారా తనను తిట్టిన వాళ్లకు ఎంతో కవితాత్మకంగా, అంతే బలమైన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.






