సర్కార్ మొద్దు నిద్ర.. మోడల్ స్కూల్లో ఏర్పాటు కాని కిచెన్ షెడ్

by Kodari Anjali |

విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోగా ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను పూర్తి చేసి విద్యార్థులకు అన్ని వసతులను ఏర్పాటు చేస్తామన్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి.

సర్కార్ మొద్దు నిద్ర.. మోడల్ స్కూల్లో ఏర్పాటు కాని కిచెన్ షెడ్
X

దిశ, ధన్వాడ: అంతా అయిపోతుందన్న మాటలే తప్ప చేతుల్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను పూర్తి చేసి విద్యార్థులకు అన్ని వసతులను ఏర్పాటు చేస్తామన్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. అమ్మో.. ఈ విద్యా సంవత్సరం కూడా మేము నరకం అనుభవించాల్సిందేనా అంటూ విద్యార్థిని విద్యార్థులు వాపోతున్నారు. విద్యా సంవత్సరం నేటి నుంచి ప్రారంభం కానుండడంతో ధన్వాడ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు యధావిధిగా ఉన్నాయి. ఎండాకాలం సెలవులు పూర్తయ్యలోగా సర్కార్ బడిలో ఉన్న చిన్న చిన్న సమస్యలను పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు పాలకులు చెప్పారు కానీ సెలవులు ముగిసిన సమస్యలు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి . ఒక్క అడుగు ముందుకు పడలేదు.

సమస్యలు ఇలా..

ధన్వాడ బాలికల కస్తూర్బా గురుకుల పాఠశాలలో దాదాపు 350 కి పైగా బాలికల ఉన్నారు ఇక్కడ ఇంతవరకు పది బాత్రూములే ఉన్నాయి. ఆ బాత్రూములు సైతం ఏం భాగాలేవు. ఇన్నాళ్లు 350 పైగా ఉన్న బాలికలకు కేవలం 10 బాత్ రూమ్ లోనే కాలం గడుపుతూ వచ్చారు. గతంలో ఇక్కడే మరికల్ కస్తూర్బా గురుకుల పాఠశాల శాతం కొనసాగేది. ధన్వాడ మరికల్ కస్తూర్బా పాఠశాలలు కలిపి 600 మంది పైగా బాలికలు ఉంటే పది పదిహేను బాత్ రూమ్ లోనే నెట్టుకొచ్చారు. గత ఏడాది క్రితం ఇక్కడి నుంచి మరికల్ కత్తూర్బ గురుకుల పాఠశాల పసుపుల సమీపంలోని సొంత భవనంలోకి మార్చారు. అయినప్పటికీ ఇక్కడ బాత్రూంలో సమస్యను గుర్తించి ప్రస్తుతం 20 బాత్ రూమ్ లో పూర్తి దశకు చేరుకున్నాయి. అయిన 350 మంది బాలికలకు గాను 20 ఈ బాత్రూం లో ఏ మాత్రం సరిపోవు. ప్రభుత్వం నాబార్డ్ నిధుల ద్వారా 50 బాత్రూంలో నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు. కానీ ఇంకా పిల్లర్స్ కే పరిమితమయ్యాయి దీంతో ఈ విద్యా సంవత్సరం సైతం బాలికలకు ఇక్కట్లు తప్పేటట్లు లేవు.

ధన్వాడ ఎస్సీ హాస్టల్...

ధన్వాడ ఎస్సి హాస్టల్ లో దాదాపు 150 మంది విద్యార్థులు ఇక్కడ ఉండి చదువుకుంటున్నారు. ఈ ఎస్సీ హాస్టల్ కి జిల్లాలోని మక్తల్ మాగనూర్. కృష్ణ మరికల్ ధన్వాడకు చెందిన విద్యార్థులు ఈ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులతో పాటు నిరుపేద విద్యార్థులు ఎంతోమంది ధన్వాడ ఎస్సీ హాస్టల్ కు వచ్చి చదువుకుంటున్నప్పటికీ ఇక్కడ చూస్తే సమస్యలు మాత్రం కోకొల్లలుగా ఉన్నాయి. హాస్టల్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. బాత్రూంలు సరిగా లేవు. హాస్టల్ ను బాలల హక్కుల రాష్ట్ర చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి... అప్పటి కలెక్టర్ ప్రీతిక్ జైన్ చూసి విస్మయం వ్యక్తం చేశారు. హాస్టల్ పరిస్థితి బాగాలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ప్రస్తుత జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక హాస్టల్ ను సందర్శించి తక్షణమే హాస్టల్ ను ఇక్కడి నుంచి మార్చాలంటూ అధికారులను ఆదేశించారు. కానీ హాస్టల్ మార్చే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సోమవారం నుంచే పాఠశాలలు ప్రారంభం అవుతున్న హాస్టల్ పరిస్థితి ఏమిటో తెలియని అయోమయంలో అధికారులు విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా ఈ శిథిలావస్థ హాస్టల్లోనే గడపాలేమోనని విద్యార్థులు భయపడిపోతున్నారు.

12 ఏళ్లు అయిన ఏర్పాటు కాని కిచెన్ షెడ్

ధన్వాడ మాడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఇప్పటికీ 12 ఏళ్లు గడిచిపోయింది. కానీ ఇక్కడ ఇప్పటికీ కిచెన్ షెడ్డు ఏర్పాటు కాలేదు దీంతో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండాలంటే ఇబ్బందిగా మారింది. వర్షాకాలంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. విద్యార్థులకు వంటలు చేయాలంటే నిర్వాకులు వానలోనే వంటలు చేయాల్సిన దుస్థితి ఉంది. ఎన్నోమార్లు పాలకులు జిల్లా కలెక్టర్ కు డీఈవో ఎంఈఓ ఎంపీడీవో కు విన్నవించిన కిచెన్ షెడ్డు మాత్రం ఏర్పాటు కాలేదు. పాఠశాల పక్కనే తడకల షెడ్డులో వంటలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. వర్షాకాలంలో అయితే వంటలు సరైన సమయంలో కాకపోవడంతో విద్యార్థులు సమయానికి భోజనం చేయలేని పరిస్థితి ఉంది. గత మార్చిలో సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రంలోని అన్ని వసతి గృహాలకు గురుకుల విద్యాసంస్థలు, వంటశాలల ఆధునీకరణ కోసం 100 కోట్ల రూపాయలు బడ్జెట్ ను ప్రతిపాదించడం జరిగిందని సర్కార్ చెప్పుకొచ్చారు. కానీ పేరుకు మాత్రమే బడ్జెట్ కేటాయింపు జరిగింది. తప్ప ఎక్కడ కూడా ఆధునీకరణ పనులు జరగలేదు. ఇదిలా ఉండగా పలు గురుకుల పాఠశాలలు సైతం కలరింగ్ లేకపోవడం వల్ల భవనాలు కళాహీనంగా కనిపిస్తున్నాయి. మరికల్ గురుకుల పాఠశాల కలరింగ్ లేకపోవడం చూస్తుంటేనే భవనాలు శిథిలావస్థకు చేరుకొని కళాహీనంగా కనిపిస్తున్నాయి.

జిల్లాలో ఇన్చార్జి ఎంఈఓ లే..

నారాయణపేట జిల్లాలోని అన్ని మండలాల్లో ఇన్చార్జి ఎంఈఓల పాలన కొనసాగుతుంది. ఆయా మండలాల్లో పనిచేసే జీహెచ్ ఎం లకు ఇన్చార్జి ఎంఈఓ గా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఇన్చార్జి ఎంఈఓగా ఉన్న జిహెచ్ఎంలు పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. తాము పనిచేసే పాఠశాలలో విద్యార్థులకు బోధన చెప్పే పరిస్థితుల్లో జిహెచ్ఎంలు లేరు. ధన్వాడ మరికల్ ఉట్కూర్ మద్దూర్ మగనూర్ కృష్ణ నారాయణపేట కోస్గి గుండుమల్ మండలాల్లో ఇంచార్జి ఎంఈఓలే కొనసాగుతున్నారు.

గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులే... ఇన్చార్జి ఎంఈఓ

పై ఫోటోలో కనిపిస్తున్న అధికారి పేరు గాయత్రి ప్రస్తుతం ధన్వాడ మండల ఇన్చార్జి ఎంఈఓగా పనిచేస్తున్నారు. బాలికల ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తూ అదనపు బాధ్యతగా ఇన్చార్జి ఎంఈఓ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటు పాఠశాల మండలంలోని ఆయా పాఠశాలలు చూసుకోవాలంటే ఇబ్బందులు తప్పడం లేదు.

హాస్టల్ మార్చాలని కలెక్టర్ ఆదేశాలు.. సాయి రెడ్డి

ధన్వాడ సాంఘిక సంక్షేమ హాస్టల్ శిథిలావస్థకు చేరుకున్న విషయం అధికారులు గుర్తించారు. గత కొన్ని రోజుల క్రితం జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక మేడం హాస్టల్‌ను పరిశీలించారు. హాస్టల్‌ను మార్చాలని ఆదేశించారు. స్థానికంగా ఓ భవనం చూసి అధికారులకు సమాచారం ఇచ్చాం.

Next Story