కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష ప్రభుత్వాలపై దాడి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

by Kodari Anjali |

బీహార్,బెంగాల్ ఫార్ములాను ఇక్కడా ప్రయోగిస్తున్నారని పెద్దపల్లి జిల్లా ‘బి.ఎల్.ఏ’ల శిక్షణ శిబిరంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష ప్రభుత్వాలపై దాడి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
X

దిశ, గోదావరిఖని: ఓట్ల వేటలో కేంద్రం దొంగ దారి నా వెళుతుందని, కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తుందని, మేము మడ్డర్లు చేసే వాళ్ళం కాదని, ప్రజలకు అండగా ఉండే వాళ్లమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా ‘బి.ఎల్.ఏ’ల శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల(బి.ఎల్.ఏ)అవగాహన శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు తెరలేపిందని శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అప్రజాస్వామిక పాలన సాగుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని, బీజేపీ రాజకీయ వ్యూహాలను ఎండగడుతూ సుదీర్ఘంగా ప్రసంగించారు.

ఎస్‌ఐఆర్ ఒక పెద్ద భూతం.. దొంగదారి చర్య!...

కేంద్ర ప్రభుత్వం చట్టం రూపంలో తీసుకువచ్చిన‘ఎస్‌ఐఆర్’ఒక పెద్ద భూతం లాంటిదని, ఇది ముమ్మాటికీ దొంగదారి చర్యేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో, ఎక్కడైతే మనకు ఓట్లు ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఒక పద్ధతి ప్రకారం దాదాపు 30 నుంచి 35 శాతం ఓట్లను‘ఫేక్ ఓట్లు’గా చిత్రీకరించి వాటిని జాబితా నుంచి తొలగించేందుకు కేంద్రం పెద్ద కుట్ర చేస్తుందన్నారు. ఓటరు వయస్సులో స్వల్ప తేడాలున్నా, వంకగా చూపి ఓట్లను లేపేసే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే బీహార్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఈ పద్ధతిని ప్రయోగించి సక్సెస్ అయ్యారన్నారు. అదే ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలోనూ ప్రయోగించాలని చూస్తున్నారని ఆరోపించారు.

నిన్న ఓట్లు.. నేడు ఏకంగా సీట్లే దొంగిలిస్తున్నారు!

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మీనాక్షి నటరాజన్ కి కావలసిన ఓట్ల కంటే 11 ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. అయినప్పటికీ కేవలం ఒక పాత ఎఫ్‌ఐఆర్ కాగితాన్ని సాకుగా చూపి, ఎన్నికల అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అక్రమంగా ఆమె నామినేషన్‌ను తిరస్కరింప చేశారన్నారు. మేము మడ్డర్లు చేసే వాళ్ళం కాదు ప్రేమగా ఆప్యాయతగా ప్రజల కోసం పని చేసే వాళ్లము అని అన్నారు. సింగరేణి కార్మికుల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రేస్ పార్టీ అని తెలిపారు. బిఆర్ఎస్ నాయకులు బొగ్గు బాయిల చుట్టూ తిరుగుతు కార్మికులపై కపట ప్రేమ చూపిస్తున్నారు అని అన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తరువాతనే అసెంబ్లీ ఎన్నికల్లోకి పోతాం అని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని, భారతదేశంలో ఎక్కడ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నా ఇదే రకమైన దుర్మార్గపు పరిపాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ ఎస్ఐఆర్ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ విజయరమణ రావు, రామగుండం మక్కాన్సింగ్ హార్కర వేణుగోపల్ రావు, జనక్ ప్రసాద్, పెద్దపల్లి కాంగ్రెస్ జిల్లా కమిటీ సభ్యులు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్లు ప్రెసిడెంట్, ,ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, బూత్‌ల బి.ఎల్.ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story