కేతకిలో కర్ణాటక మంత్రి పూజలు..!

by Taduka Kalyani |   (  Updated:2026-06-14 15:08:20  IST  )

దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం కర్ణాటక రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కేతకిలో కర్ణాటక మంత్రి పూజలు..!
X

దిశ, ఝరాసంగం: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం కర్ణాటక రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన,మహామంగళహారతి నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శివరుద్రప్ప మంత్రిదంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాతో సత్కరించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు పాటిల్, శేఖర్ పాటిల్, వేణుగోపాల్ రెడ్డి, ఆలయ అర్చకులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Next Story