ఆధ్యాత్మిక కీర్తనలతో మార్మోగిన రామాలయం

by Jakkula.Mamatha |

ఎన్ ఎస్ ఎంటర్టైన్మెంట్, నాగసాయి భజన బృందం ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం ఎన్నెస్పీ రామగిరి రామాలయంలో బాణాపురంకు చెందిన ప్రముఖ భక్తి గీతాల గాయకులు రాయల నాగసాయి చేపట్టిన 14 గంటల నిర్విరామ హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతోంది.

ఆధ్యాత్మిక కీర్తనలతో మార్మోగిన రామాలయం
X

దిశ, ఖమ్మం కల్చరల్: ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్, నాగసాయి భజన బృందం ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం ఎన్నెస్పీ రామగిరి రామాలయంలో బాణాపురంకు చెందిన ప్రముఖ భక్తి గీతాల గాయకులు రాయల నాగసాయి చేపట్టిన 14 గంటల నిర్విరామ హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతోంది. ఉదయం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్స్ ఫోరం తెలంగాణ ముఖ్య సమన్వయకర్త వంజా మాలతి నాయుడు, రామాలయ ప్రధాన అర్చకులు సముద్రాల వేంకట నరసింహాచార్యులు పాల్గొన్నారు. 2024 లో రెండు అంతర్జాతీయ రికార్డులు కైవసం చేసుకున్న గాయకుడు నాగసాయి తాజాగా రెండు అంతర్జాతీయ, ఒక జాతీయ రికార్డులు సాధించాలనే దీక్షతో ఈ మహా క్రతువుకు పూనుకున్నారు.

లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి హనుమాన్ భక్తులు, ఆధ్యాత్మిక సేవకులు, భజన బృందాలు వందలాదిగా తరలివచ్చారు. ప్రాంగణమంతా భక్త జన సందోహంతో నిండిపోయింది. రాత్రికి జరిగే కార్యక్రమంలో అతిధుల చేతులమీదుగా నాగసాయికి అవార్డులు ప్రదానం చేయబడతాయని కార్యక్రమ పర్యవేక్షకులు వెంకట నరసింహాచార్యులు తెలిపారు. స్కౌట్స్అండ్ గైడ్స్ లీడర్ మైలవరపు గిరిజాదేవి, స్వరాజ్ ఆర్ట్స్ కుటుంబరావు, వ్యాఖ్యాత జల్లేపల్లి రమేష్, గాయకుడు ఆకుల గణపతిరాజు, మెజీషియన్ ఈశ్వర్ బహుదూర్, భిక్షపతి తదితరులు హాజరయ్యారు.

Next Story