- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జవహర్‌నగర్‌లో 2.100 కేజీల గంజాయి పట్టివేత..
గంజాయి విక్రయిస్తుండగా మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

దిశ, జవహర్నగర్: జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తుండగా మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన కాప్రా మండల పరిధి అనీషా కాలేజీ, జవహర్ నగర్ అంబేద్కర్నగర్ పరిధిలో చోటుచేసుకుంది. ఎక్సైజ్ సీఐ రవి తెలిపిన కథనం ప్రకారం... జవహర్నగర్ అంబేద్కర్నగర్ లో గంజాయిని అమ్ముతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు టీజీఎస్ఆర్టీసీ డిపో ఎదురుగా ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ ద్విచక్ర వాహణాన్ని పట్టుకున్నారు. పరిశీలించగా 1.36 5కేజీల గంజాయి బయటపడగా, స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులైన షేక్ సల్మాన్ అలియాస్ సలీమ్(25), సెమంగుల రఘ(24), మారిపల్లి మహేష్(23) లను అరెస్ట్ చేశారు. మరో ఘటనలో సాకేత్ ప్రాంతంలోని అనీష్ కాలేజీ సమీపంలో గంజాయి అమ్ముతున్నట్లు తెలిసిన సమాచారం మేరకు నిందితులు పషీక్, షర్పుద్దీన్‌లను అరెస్ట్ చేసి 710 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల గంజాయిని పొట్లాలుగా మార్చి రూ. 300, 500లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని, చట్టరీత్యా గంజాయి అమ్మిన, కొనుగోలు చేసిన నేరమని హెచ్చరించారు. ఈ మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






