- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: ఏఐ పుణ్యమా అని క్రేజీ జాబ్స్..! గంటకు రూ.250 సంపాదిస్తున్న మహిళలు
భారతదేశంలో రోబోలకు ఇంటి పనులు నేర్పేందుకు ఏఐ కంపెనీలు సరికొత్త ఉపాధిని కల్పిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఉద్యోగాలు ఊడుతుంటే.. అదే ఏఐ టెక్నాలజీ భారత మహిళలు, గిగ్ వర్కర్లకు సరికొత్త ఉపాధిని చూపుతోంది. రోబోలు భవిష్యత్తులో మనుషుల్లాగే ఇంటి పనులు (Chores) చేయడానికి వీలుగా వాటికి శిక్షణ ఇచ్చేందుకు భారత్‌కు చెందిన వందలాది మంది మహిళలు, కార్మికులు కొత్త తరహాలో పనులు చేస్తున్నారు. ఏకంగా తలపై కెమెరాలను ధరించి, తాము చేసే రోజువారీ పనులను రికార్డ్ చేస్తూ వారు గంటకు 3 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.250 వరకు సంపాదిస్తున్నారు.
రోబోల కోసం ‘ఫస్ట్ పర్సన్’ డేటా సేకరణ
ప్రముఖ ఏఐ స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు తమ హోమ్-రోబోటిక్స్ (Home Robotics) ప్రాజెక్టుల కోసం ఈ తరహా డేటాను సేకరిస్తున్నాయి. ఇందులో భాగంగా భారతీయ కార్మికులు తమ తలపై ప్రత్యేకమైన గోప్రో (GoPro) లేదా స్మార్ట్ కెమెరాలను అమర్చుకుంటారు. వారు ఇల్లు ఊడవడం, తుడవడం, పాత్రలు కడగడం, వంట చేయడం, కూరగాయలు కోయడం వంటి పనులను చేస్తుంటారు. కెమెరాలు వారు చేసే ప్రతి కదలికను, వస్తువులను పట్టుకునే విధానాన్ని ‘ఫస్ట్-పర్సన్ పర్స్పెక్టివ్’ (First-Person Perspective) లో ఖచ్చితంగా రికార్డ్ చేస్తాయి. ఈ దృశ్యాలను విశ్లేషించడం ద్వారా రోబోలు మనుషుల లాగే పనులను ఎలా చేయాలో నేర్చుకుంటాయి.
గ్రామాలు, పట్టణాల్లో యమ డిమాండ్..
దేశంలో ఈ రకమైన పార్ట్ టైమ్, గిగ్ (Gig) వర్క్‌కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ జాబ్ చేసేందుకు చదువు, స్కిల్స్ పెద్దగా అక్కర్లేదు. కేవలం తమ రోజువారీ పనులను రికార్డ్ చేయడం ద్వారా సులభంగా డబ్బు సంపాదిస్తున్నారు. గంటకు రూ. 250 చొప్పున రోజుకు కొన్ని గంటలు కేటాయించడంతో ఎంతో కోంత డబ్బు వెనకేసుకుంటున్నారు. అయితే, ఏఐ అభివృద్ధి చెందాలంటే కేవలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో డేటాను అందించే ఇటువంటి డేటా లేబరర్స్ (Data Laborers) అవసరం కూడా ఎంతో ఉందని ఈ క్రేజీ జాబ్స్‌తో మరోసారి నిరూపితమైంది.






