ఢిల్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం.. రేపటి సమావేశానికి కీలక దిశానిర్దేశం

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు.

ఢిల్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం.. రేపటి సమావేశానికి కీలక దిశానిర్దేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం (రేపు) నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘సేన ప్రస్థానం... దేశ సమగ్రత కోసం’ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి విచ్చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు జనసేన పార్టీ పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన బస చేసిన హోటల్ వద్దకు చేరుకున్న పవన్ కల్యాణ్‌కు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పూర్ణకుంభంతో మధ్య ఘనంగా స్వాగతించారు.

రేపటి సమావేశంలో కీలక దిశానిర్దేశం..

జాతీయ సమగ్రతను కాపాడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ‘సేన ప్రస్థానం... జాతీయ సమగ్రత కోసం’ అనే అంశంపై సోమవారం విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొని, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, దేశ సమగ్రతలో పార్టీ పాత్రపై నాయకులకు, ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Next Story