రికార్డు సృష్టించిన భారత్, పాక్ మ్యాచ్..2024 త‌ర్వాత ఇదే తొలిసారి

by velandi.Saikiran |

మ‌హిళ‌ల‌ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో భారత్, పాక్ మ్యాచ్ రికార్డు సృష్టించింది.

రికార్డు సృష్టించిన భారత్, పాక్ మ్యాచ్..2024 త‌ర్వాత ఇదే తొలిసారి
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం భారత్, పాక్ మధ్య గ్రూప్ స్టేజ్ లో మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా ప్రదర్శన కనబరిచిన భారత జట్టు, పాకిస్తాన్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో 64 పరుగుల తేడాతో భారత్ విక్టరీ నమోదు చేసుకొని, వరల్డ్ కప్ లో బోణీ కొట్టింది. ఇది ఇలా ఉండగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో అత్యధిక అటెండెన్స్ నమోదైన మ్యాచ్ గా నిలిచింది.

ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ను 18, 814 మంది ప్రత్యక్షంగా వీక్షించారు. ఇప్పటి వరకు ఈ రికార్డు 2024లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్, భారత జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పైనే ఉంది. ఆ సమయంలో 15,935 మంది ప్రత్యక్షంగా మ్యాచ్ తిలకించారు. ఇప్పుడు ఆ రికార్డును లేటెస్ట్ మ్యాచ్ బ్రేక్ చేసింది. ఇది ఇలా ఉండగా టీ20 వరల్డ్ కప్ లో పాక్ వర్సెస్ భారత్ మధ్య 9సార్లు మ్యాచ్ జరిగింది. ఇందులో ఏడుసార్లు ఇండియానే విజయం సాధించడం గమనార్హం.

Next Story