ఆ లేడీ కోహ్లీ వ‌ల్లే మేం ఓడిపోయాం..పాక్ కెప్టెన్ ప్ర‌క‌ట‌న

by velandi.Saikiran |

ఆ లేడీ కోహ్లీ వ‌ల్లే మేం ఓడిపోయామంటూ పాక్ కెప్టెన్ ఫాతిమా స‌నా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఆ లేడీ కోహ్లీ వ‌ల్లే మేం ఓడిపోయాం..పాక్ కెప్టెన్ ప్ర‌క‌ట‌న
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ను భారత జట్టు ఓడించింది. పాకిస్తాన్ పై ఏకంగా 64 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ చెత్త ఫీల్డ్ కారణంగానే ఓడిపోయినట్లు ఒప్పుకున్నారు. స్మృతి మందానను త్వరగా పెవిలియ‌న్ కు పంపించ‌డంలో తమ జట్టు విఫలమైందని వివరించారు. అలాగే ఆమె ఇచ్చిన అద్భుతమైన క్యాచ్ ను వదిలేసామని... అదే తమ ఓటమికి కారణమైందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక చివరి 5 ఓవర్లలో భారత జట్టుకు ఎక్కువగా పరుగులు ఇచ్చామని, ఫీల్డర్స్ కూడా ఏకాగ్ర‌త‌గా ఆడ‌లేద‌ని సీరియ‌స్ అయ్యారు. త‌ర్వాతి మ్యాచ్ లో కంబ్యాక్ ఇస్తామ‌న్నారు.

Next Story