సినిమాలు మానేయాలి అని డిసైడ్ అయ్యా - నివేదా పేతురాజ్

by velandi.Saikiran |

సింగ్‌ గీతం’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నివేదా పేతురాజ్, సక్సెస్ మీట్ సందర్భంగా కీలక విషయాలను పంచుకున్నారు.

సినిమాలు మానేయాలి అని డిసైడ్ అయ్యా - నివేదా పేతురాజ్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో నివేదా పేతురాజ్ ఒకరు. తమిళనాడు రాష్ట్రంలో పుట్టి పెరిగిన ఈ అందాల తార, 2017లో మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో, పాగల్, రెడ్, ధ‌మ్కీ లాంటి ఎన్నో బిగ్గెస్ట్ సినిమాలు చేశారు. అయితే అలాంటి నివేదా తాజాగా తన కెరీర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023 సమయంలోనే సినిమాలు మానేసి, హిమాలయాలకు వెళ్లిపోవాలని అనుకున్నట్లు కామెంట్ చేశారు.

కానీ నాగ అశ్విన్ లైఫ్ తన జీవితాన్ని కాపాడారని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ‘సింగ్‌ గీతం’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నివేదా పేతురాజ్, సక్సెస్ మీట్ సందర్భంగా కీలక విషయాలను పంచుకున్నారు. 2023 సంవత్సరంలో కొన్ని కారణాల వల్ల సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత తప్పుడు దారిలో నడిచానని తెలిపారు. ఫైనల్ గా ‘సింగ్‌ గీతం’ తో రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా అనిపించిందన్నారు. తనకు నాగ అశ్విన్ లైఫ్ ఇచ్చారని పూర్తి చేశారు. లేదంటే హిమాలయాలలో ఉండేదాన్ని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా గతంలో తన ప్రియుడిని పరిచయం చేసిన నివేదా, అతన్ని పెళ్లి చేసుకుంటానని కూడా ప్రకటించింది. కానీ అంతలోనే ఈ జంట పెళ్లి రద్దయింది.

Next Story