- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనిల్ రావిపూడి కొత్త సినిమా టైటిల్ ఇదేనా ?
అనిల్ రావిపూడి కొత్త సినిమా టైటిల్ పై చర్చ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో 100% సక్సెస్ రేట్ ఉన్న వారిలో అనిల్ రావిపూడి కూడా ఉంటారు. ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీ విత్ కామెడీ సినిమాతో వచ్చి సక్సెస్ అందుకుంటున్నారు. ఇక త్వరలోనే నందమూరి కళ్యాణ్ రామ్, విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయబోతున్నారు. ఈ మల్టీస్టారర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో ఇప్పటికే సినిమాలు చేసి బంపర్ హిట్ అందుకున్నారు అనిల్ రావిపూడి. ఇక ఇప్పుడు ఈ ఇద్దరితో అదిరిపోయే సినిమా చేసి.. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇవ్వాలని స్కెచ్ వేశారు. ఇలాంటి క్రమంలోనే ఈ మూవీ టైటిల్ గురించి సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. సంక్రాంతి సరుకు అనే టైటిల్ ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో పండుగకు తగ్గట్టుగానే టైటిల్ ఉండాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతి సరుకు అనే టైటిల్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.






