కేటీఆర్ తో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌.. వీడియో వైర‌ల్

by velandi.Saikiran |

కేటీఆర్ తో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స‌ర‌ద‌గా గ‌డిపిన‌ వీడియో వైర‌ల్ అయింది.

కేటీఆర్ తో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌.. వీడియో వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇద్దరు సరదాగా గడిపిన వీడియో వైరల్ గా మారింది. పొద్దున లేస్తే చాలు, తిట్టుకునే ఈ ఇద్దరు, అనుకోకుండా కలిశారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట వెడ్డింగ్ సెర్మనీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా కేటీఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ కేటీఆర్‌, పొన్నం ఎదురుప‌డ్డారు. అనంత‌రం స‌ర‌ద‌గా గ‌డిపిన ఈ ఇద్ద‌రు ఫోటోలు కూడా దిగారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన జనాలు షాక్ అవుతున్నారు. పొద్దున లేస్తే ఒకరి పైన మరొకరు అబాండాలు వేసుకుంటూ.. బండ బూతులు తిట్టుకునే ఈ ఇద్దరు లీడర్లు... ఎప్పుడు కలిసిపోయారంటూ వాపోతున్నారు. మీడియా ముందు తిట్టుకునే ఈ ఇద్దరు.. వ్యక్తిగతంగా మాత్రం చాలా క్లోజ్ అని మరి కొంత మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని, ప్రైవేట్ కార్యక్రమాలలో ప్ర‌త్య‌ర్థులు కలిసి ఉంటే, బాగుంటుంద‌ని వ్యాహ్య‌నించారు.

Next Story