విజయ్ మీసం తిప్పిన రష్మిక..క్యూట్ వీడియో వైర‌ల్

by velandi.Saikiran |

హీరో విజయ్ మీసం తిప్పిన రష్మిక వీడియో వైర‌ల్ గా మారింది.

విజయ్ మీసం తిప్పిన రష్మిక..క్యూట్ వీడియో వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలోనే ఈ జంట, పెద్దలను ఒప్పించి మరీ, గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. పెళ్లి జరగగానే హనీమూన్ ఎంజాయ్ చేసిన‌ ఈ జంట.. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ చేసింది. అయితే లేటెస్ట్ గా స్కాలర్ షిప్ పంపిణీ కార్యక్రమంలో మెరిసారు విజయ్, రష్మిక. ఈ సంద‌ర్భంగా విజ‌య్ మీసాలు ర‌ష్మిక‌ తిప్పగా, ఆ క్యూట్ వీడియో వైరల్ గా మారింది.

స్టేజ్ పైన ఉన్న విజయ్ కి చెమ‌ట వ‌చ్చిన నేప‌థ్యంలో కర్చీఫ్ తో తుడిచిన‌ ర‌ష్మిక‌... అనంత‌రం త‌న భ‌ర్త‌ మీసాన్ని తిప్పింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ ఫిదా అయిపోతున్నారు. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. వేదిక పైన ఇలా చేస్తే కచ్చితంగా వీళ్లకు దిష్టి తగులుతుందని కొందరు అంటుంటే... భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలని మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు. కాగా అచ్చంపేట నియోజకవర్గంలో స్కాలర్ షిప్ పంపిణీ కార్యక్రమం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా 47 ప్రభుత్వ పాఠశాలలలో 9, 10 తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకు సాధించిన 151 మంది విద్యార్థులకు రష్మిక-విజయ్ దంపతులు నగదు బహుమతి అందించారు.

Next Story