- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంభీర్ వల్లే రెచ్చిపోయి ఆడుతున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ సంచలనం !
భారత్‌పై సెంచరీ సాధించిన తర్వాత గౌతమ్ గంభీర్‌కు క్రెడిట్ ఇస్తూ రెహ్మానుల్లా గుర్బాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: పురుషుల భారత జట్టు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. శనివారం రోజున ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ అద్భుతంగా రాణించి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. వర్షం పడిన నేపథ్యంలో మ్యాచ్ ను 25 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ పై ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది భారత్. అయితే ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ సెంచరీతో రెచ్చిపోయాడు.
మిగిలిన ప్లేయర్లు ఎవరు రాణించకపోయినా.. జట్టుకు భారీ స్కోరు అందించాడు. అయితే తన సెంచరీపై మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రహ్మానుల్లా గుర్బాజ్. భారత్ తో జరిగిన ఏకైక టెస్టు తర్వాత గంభీర్ ను తాను కలిశానని వెల్లడించారు. ఈ సందర్భంగా తన బ్యాటింగ్ ఇంప్రూవ్ మెంట్ పై గంభీర్ చాలా సూచనలు చేశారని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. తనతో పాటు కొంత మంది ప్లేయర్లకు కూడా గంభీర్ సలహాలు ఇచ్చాడని వెల్లడించారు. ఈ క్రమంలోనే సులభంగా సెంచరీ చేసినట్లు పేర్కొన్నారు. గంభీర్ లాంటి కోచ్ ఉండడం భారత జట్టు అదృష్టం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.






