Jio Platforms: గ్లోబల్ పేటెంట్ ర్యాంకింగ్స్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డు

by S Gopi |

2025 ర్యాంకింగ్స్‌లో జియో ఏకంగా 320 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరుకోవడం విశేషం.

Jio Platforms: గ్లోబల్ పేటెంట్ ర్యాంకింగ్స్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ టెక్నాలజీ రంగంలో జియో ప్లాట్‌ఫామ్స్ మరో కీలక మైలురాయిని అందుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఈ డిజిటల్, టెక్నాలజీ విభాగం తాజాగా విడుదలైన ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీఓ) పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ (పీసీటీ) ర్యాంకింగ్స్‌లో ప్రపంచ టాప్-20 జాబితాలో చోటు సంపాదించింది. 2025 ర్యాంకింగ్స్‌లో జియో ఏకంగా 320 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరుకోవడం విశేషం. దీంతో హువావే, శాంసంగ్, క్వాల్‌కామ్, ఎల్‌జీ, పానాసోనిక్, నోకియా, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజాల సరసన నిలిచిన ఏకైక భారతీయ టెక్నాలజీ సంస్థగా జియో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ దరఖాస్తుల వృద్ధి 1 శాతం కంటే తక్కువగా నమోదైన ఏడాదిలో జియో సాధించిన ఈ భారీ పురోగతి సంస్థ పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది.

జియో పేటెంట్ వ్యూహం ప్రధానంగా 5జీ, 5జీ అడ్వాన్స్‌డ్, 6జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఏఐ-నేటివ్ నెట్‌వర్క్స్, క్లౌడ్-నేటివ్ ప్లాట్‌ఫార్మ్స్, ఇంటెలిజెంట్ ఆటోమేషన్, ఎడ్జ్ కంప్యూటింగ్, నెట్‌వర్క్ స్లైసింగ్ వంటి భవిష్యత్తు టెక్నాలజీపై పేటెంట్లు సాధించాలని జియో పట్టుదలగా ఉంది. 2026, మార్చి 31 నాటికి జియో ప్రపంచవ్యాప్తంగా 6,817 పేటెంట్ దరఖాస్తులు దాఖలు చేయగా, వాటిలో 2,393 భారత్‌లో, 4,424 విదేశీ మార్కెట్లలో నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 1,009 పేటెంట్లు మంజూరయ్యాయి.

Next Story