- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Finance Ministry: భారత స్టాక్ మార్కెట్‌కు గ్లోబల్ డోర్లు తెరిచిన కేంద్రం
తాజా సవరణల ప్రకారం, ఇకపై భారత్‌కు వెలుపల నివసించే ఏ విదేశీ వ్యక్తి అయినా భారత స్టాక్ మార్కెట్‌లో లిస్టెడ్ కంపెనీల షేర్లు, ఇతర సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టవచ్చు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ పెట్టుబడులను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ (పీఐఎస్) నిబంధనలను సడలించింది. దీనికి సంబంధించి తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ (నాన్-డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్) రూల్స్‌లో చేసిన తాజా సవరణల ప్రకారం, ఇకపై భారత్‌కు వెలుపల నివసించే ఏ విదేశీ వ్యక్తి అయినా భారత స్టాక్ మార్కెట్‌లో లిస్టెడ్ కంపెనీల షేర్లు, ఇతర సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇప్పటివరకు ఈ అవకాశం కేవలం ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐలు)కు మాత్రమే ఉండేది. కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రతిపాదనకు అనుగుణంగా ప్రస్తుతం ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. భారత మార్కెట్లలో విదేశీ మూలధన ప్రవాహాన్ని పెంచడం, పెట్టుబడిదారుల వర్గాన్ని విస్తరించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
అయితే జాతీయ భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని పరిమితులను కూడా ప్రభుత్వం కొనసాగించింది. మనదేశంతో భూ సరిహద్దు పంచుకునే దేశాల పౌరులు లేదా సంస్థలకు యాజమాన్యం, నియంత్రణ బదిలీ అయ్యే అవకాశం ఉన్న పెట్టుబడులకు ముందస్తు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నిర్ణయం భారత స్టాక్ మార్కెట్‌ను ప్రపంచ పెట్టుబడిదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, ఎఫ్‌పీఐ లేదా ఎఫ్‌డీఐ మార్గాల్లో ఉన్న సంక్లిష్టతలను తప్పించి పెట్టుబడులకు కొత్త మార్గాన్ని అందిస్తుంది. అయితే ఈ కొత్త వర్గం పెట్టుబడిదారుల కోసం కేవైసీ, బెనిఫిషియల్ ఓనర్‌షిప్ ధృవీకరణ వంటి అంశాలపై సెబీ, ఆర్‌బీఐ త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంటుంది.






