- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీ కిందికి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
by Kodari Anjali |
రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి దూసుకెళ్లడంతో ఒక వ్యక్తి స్పాట్ డెడ్ కాగా, నలుగురికి గాయాలయ్యాయి.

X
దిశ, మక్తల్: రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి దూసుకెళ్లడంతో శేఖరప్ప( 60) అక్కడి కక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడేబల్లుర్ గ్రామ శివారులోని టైరోడ్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. వీరంతా రాయచూర్‌కి చెందిన వారు కావడంతో మృతదేహాన్ని గాయపడిన వారిని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు సమాచారం. అమావాస్యని పురస్కరించుకొని స్థానిక రాయిచూర్‌కు చెందిన వీరు యాదగిరి జిల్లా కళబెళగుందే శివాలయం దర్శించుకొని రాయచూర్‌కు తిరిగి వెళ్తూ టైరోడ్ శివారులో ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టి లారీ కిందికి దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన నలుగురిని స్థానికులు రక్షించి రాయచూరు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై తమకేమి సమాచారం లేదని కృష్ణ పోలీసులు అంటున్నారు.
Next Story






