- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్టు జూపాక శివమణికి 'ఇండియన్ ఐకాన్ అవార్డు' ప్రదానం..
హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన యువ జర్నలిస్టు జూపాక శివమణి ప్రతిష్టాత్మక 'ఇండియన్ ఐకాన్ అవార్డు' అందుకున్నారు.

దిశ, హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన యువ జర్నలిస్టు జూపాక శివమణి ప్రతిష్టాత్మక 'ఇండియన్ ఐకాన్ అవార్డు' అందుకున్నారు. పత్రికా రంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ తెలుగు వెలుగు సాహితీ వేదిక, తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక కళా పరిషత్ సంస్థల వ్యవస్థాపకులు పోలోజు రాజ్ కుమార్ ఈ అవార్డుకు శివమణిని ఎంపిక చేశారు. వరంగల్‌లోని ఎన్‌జీఓస్ భవనంలో ఘనంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు.
ప్రముఖుల చేతుల మీదుగా సత్కారం...
ఈ అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొన్న ప్రముఖులు జూపాక శివమణిని శాలువాతో ఘనంగా సత్కరించి, అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో బస్వరాజు సారయ్య (మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు), ఇనుగాల వెంకట్రాంరెడ్డి (కూడా - చైర్మన్), డా. వంగాల శాంతికృష్ణ ఆచార్య, (విశ్వకళా విరాట్ బ్రహ్మశ్రీ), డా. వనపర్తి పద్మావతి (బతుకమ్మతల్లి గ్రంథకర్త), అప్పినపల్లి భాస్కరాచార్యులు (సినీ నిర్మాత, నటులు), బ్రహ్మశ్రీ బసవత్తుల రాజమౌళీశ్వరస్వామి (శ్రీ జగత్మహామునీశ్వర స్వామి ఆశ్రమ పీఠాధిపతులు), ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో వివిధ సామాజిక సంస్థల వ్యవస్థాపకులు, సామాజికవేత్తలు, కళాకారులు, కవులు, రచయితలు పెద్ద సంఖ్యలో పాల్గొని అవార్డు గ్రహీత శివమణికి అభినందనలు తెలిపారు. యువ జర్నలిస్ట్‌గా శివమణి అందిస్తున్న సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు.






