- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీ భవన్‌లో మెగాజాబ్ మేళా.. యువతకు ఆహ్వానం
తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 19న గాంధీ భవన్ లో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నామని, 100 కంపెనీలు గాంధీ భవన్ కు వస్తున్నాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ..

దిశ, తెలంగాణ బ్యూరో: తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 19న గాంధీ భవన్ లో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నామని, 100 కంపెనీలు గాంధీ భవన్ కు వస్తున్నాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత అందరూ జాబ్ మేళాను ఉపయోగించుకోవాలని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లక్ష మందికి వివిధ రంగాల్లో ఉద్యోగఅవకాశాలు కల్పించిందన్నారు. రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థ పై పోరాటం చేస్తున్నారని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కేంద్రంపై యువనేత రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజ్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని, మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మోడీ 12ఏండ్లు దేశానికి ఏమి చేశాడని సంబరాలు చేస్తున్నారని, దీనికి బీజేపీ నాయకులు సమాధానాలను చెప్పాలని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఇందిరా గాంధీ, నెహ్రు, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహ రావులు ప్రధానులుగా చేసిన అభివృద్ధికి పేరు మార్చి మోడీ భజన చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేటీఆర్ కుటుంబంలో అందరూ వెన్నుపోటు దారులే అని, ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడుస్తున్నారో ప్రజలకు తెలుసని అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు.






